Ellamma Movie : ఎల్లమ్మ నుంచి నితిన్ ఔట్…మరో యంగ్ హీరోకు ఛాన్స్… అసలేం జరిగింది..?

Ellamma Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో మంచి సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ఒకరు…ప్రస్తుతం ఆయన టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఇకమీదట ఆయన చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వేణు ఎల్దండి దర్శకుడి గా మారి చేసిన బాగం మూవీ సూపర్ సక్సెస్ అయింది. దాంతో మరోసారి అతనితో ‘ఎల్లమ్మ’ అనే ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో తను బిజీగా ఉన్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకి నాని హీరోగా చేస్తున్నాడు అంటూ అప్పట్లో వార్తలైతే వచ్చాయి. ఇక ఆ తర్వాత ఆయన ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో నితిన్ ఈ సినిమాకి హీరోగా సెట్ చేశారు. అయితే ఇప్పటివరకు నితిన్ ఈ సినిమా మీదనే చాలా కసరత్తులు చేశాడు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం నితిన్ ఈ సినిమా నుంచి బయటికి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది.

ఇక శర్వానంద్ తో ఈ సినిమా చేయాలని దిల్ రాజు అనుకుంటున్నాడట. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా విషయంలో ఇంత మంది హీరోలు ఎందుకు మారుతున్నారు. కథలో ఉన్న డెప్త్ హీరోలకి అర్థం కావడం లేదా? లేదంటే ఈ సబ్జెక్ట్ ను ఈ హీరోలు హ్యాండిల్ చేయలేరనే ఉద్దేశ్యంతో దర్శక నిర్మాతలే వాళ్ళని మారుస్తున్నారా? అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది…

ఇక శర్వానంద్ తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతూ తెలంగాణ విలేజ్ కుర్రాడిలా కనిపిస్తాడా? ఒకవేళ ఆయన కనిపించినా కూడా అది న్యాచురల్ గా సెట్ అవుతుందా? లేదా అనేది ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది. మరి ఏది ఏమైనా కూడా దిల్ రాజు ఎందుకని ఇలా ఈ ప్రాజెక్టులో ఇంత మంది హీరోలను మార్చాల్సి వస్తోంది. కాన్సెప్ట్ ఏదైనా తేడాగా ఉందా మళ్ళీ దాన్ని రీ రైట్ చేసే పనిలో ఉన్నారా అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న ప్రశ్న…

మరి ఈ సినిమాతో ఎవరు ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటారు. వేణు సూపర్ సక్సెస్ ని అందుకొని స్టార్ట్ డైరెక్టర్ గా తన పేరు ను చిరస్మరణీయంగా నిలుపుకుంటాడా? మరి శర్వానంద్ అయిన ఈ సినిమాకి హీరోగా చేస్తాడా? లేదంటే మళ్లీ ఆయనను కూడా మార్చే అవకాశాలు ఉన్నాయా? అనే ధోరణిలో కూడా కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి…

Leave a Comment