బ్రేక్‌ఫాస్ట్ అనే రోజులో మనకు అతి ముఖ్యమైన భోజనం. కానీ మారుతున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా చాలా మంది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మానేయడం అలవాటు చేసుకున్నారు. ఇలా బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిలో పంటి సమస్యలు కూడా ఉన్నాయని మీకు తెలుసా?
అవును మనం బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల మన పంటి ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని వైద్య నిపుణులు అంటున్నారు. బ్రేక్‌ఫాస్ట్ దాటవేయడం వల్ల మన శరీర అంతర్గత నిర్మాణం మారుతుంది. ఇది గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది.
మనం ఎక్కువసేపు తినకుండా ఉండడం వల్ల.. మనం ఏమీ నమలము. దీని కారణంగా లాలాజల ఉత్పత్తిని కూడా తగ్గిస్తుంది. లాలాజలం అనేది శరీరంలోని ఆమ్లాన్ని తటస్తం చేయడానికి సహాయపడే సహజ పదార్ధం. మనం బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసినప్పుడు లాలా జలం ఉత్పత్తి తగ్గి కడుపులో ఆమ్లత్వం పెరుగుతుంది.
ఈ ఆమ్లత్వం మన కడుపుపైనే కాకుండా దంత ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఆమ్లత్వం నోటిలోని pH ని మారుస్తుంది. ఇది మన నోట్లోని ఎనామిల్ పొర కోతకు దారి తీసుస్తుంది. దీని వల్ల దంత క్షయం, కావిటీస్ వంటి సమస్యలు వస్తాయి.
కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండేందుకు.. బ్రేక్‌ఫాస్ట్‌ను రోజూ తప్పకుండా తినండి. మీ శరీరంలో ఆమ్లతను నివారించడానికి ఉదయం నీరు త్రాగడం ద్వారా మీ డేను స్టార్ట్ చేయండి. ఖాళీ కడుపుతో వేడి టీ, కాఫీ మొదలైనవి తాగడం మానుకోండి. (NOTE: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.)
[