Mukesh Ambani: ముఖేష్‌ అంబానీ కరెంటు బిల్లు ఎంత వస్తుందో తెలిస్తే బిత్తరపోతారు! – Telugu News | Mukesh Ambani, Nita Ambani’s Antilla electricity bill will shock you, enough to power 7000 homes

Mukesh Ambani: భారతదేశంలోని అత్యంత ధనిక కుటుంబాలలో ఒకటైన ముఖేష్ అంబానీ అందరి నోట ఎక్కువగా మాట్లాడుకునే పేర్లలో ఒకటి. ఫోర్బ్స్ ప్రకారం, అతని మొత్తం సంపద దాదాపు $91.3 బిలియన్లు. ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్.

చాలా మంది ఇళ్లలో విద్యుత్‌ బిల్లు అనేది వేర్వేరుగా ఉంటుంది. సామాన్యుడి విద్యుత్‌ బిల్లు మహా అయితే రూ.200 నుంచి 300 రూపాయల వరకు ఉంటుంది. అదే కొద్దిగా ఉన్నత వర్గాల వారికి అయితే వేలల్లో ఉంటుంది. సాధారణంగా వేసవిలో కొంత ఎక్కువగా వస్తుంది. కొంత మంది ఇళ్లల్లో అన్నికాలాల పాటు ఏసీలు నడుస్తుంటాయి. ఇది నెలవారీ విద్యుత్ బిల్లును ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది.

ఇది కూడా చదవండి: Hyderabad Richest People: హైదరాబాద్‌లో టాప్‌ ధనవంతులు వీరే.. ఏయే రంగాల్లో..

ఇవి కూడా చదవండి

భారతదేశంలోని అత్యంత ధనిక కుటుంబాలలో ఒకరైన ముఖేష్ అంబానీ పేరు అందరి నోట నానుతుంది. ఫోర్బ్స్ ప్రకారం, అతని మొత్తం సంపద దాదాపు $91.3 బిలియన్లు. జియో ద్వారా భారతదేశంలో డిజిటల్ విప్లవాన్ని తీసుకువచ్చి దేశవ్యాప్తంగా భారీ 5G నెట్‌వర్క్‌ను నిర్మించారు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసం:

ముఖేష్‌ అంబానీ తన మొత్తం కుటుంబంతో – నీతా అంబానీ, ఇషా, ఆకాష్, అనంత్ అంబానీలతో కలిసి ముంబైలోని నాగరిక ప్రాంతంలో నిర్మించిన 27 అంతస్తుల విలాసవంతమైన ప్యాలెస్ ఆంటిలియాలో నివసిస్తున్నారు. ఈ ఇంటి ధర దాదాపు రూ. 15,000 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. దీని డిజైన్‌ను అమెరికన్ ఆర్కిటెక్చర్ సంస్థ పెర్కిన్స్ అండ్ విల్ తయారు చేయగా, నిర్మాణ పనులను ఆస్ట్రేలియాకు చెందిన లైటన్ హోల్డింగ్స్ కంపెనీ నిర్వహించింది. రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో వచ్చే భూకంపాలను సైతం తట్టుకునేలా ఈ నివాసాన్ని నిర్మించారు.

ఇది కూడా చదవండి: Schools Holiday: విద్యార్థులకు మళ్లీ పండగ లాంటి వార్త.. గురువారం విద్యాసంస్థకు సెలవు.. ఎందుకంటే

ఈ 27 అంతస్తుల ఆంటిలియా భవనంలో జిమ్, స్పా, థియేటర్, టెర్రస్ గార్డెన్, స్విమ్మింగ్ పూల్ నుండి ఆలయం, ఆరోగ్య సంరక్షణ వరకు ప్రతిదీ ఉంది. దీనితో పాటు 150 కి పైగా కార్లను పార్కింగ్ చేయడానికి కూడా స్థలం ఉంది. దీనితో పాటు టెర్రస్ గార్డెన్, 3 హెలిప్యాడ్‌లు ఉన్నాయి. పై 6 అంతస్తులు ప్రైవేట్ నివాస స్థలాలు, ఇందులో అంబానీ కుటుంబం నివసిస్తుంది.

ఇది కూడా చదవండి: Indian Passport Colours: భారతదేశంలో ఈ 4 రంగులలో జారీ చేసే పాస్‌పోర్ట్‌ల అర్థం ఏమిటి?

కరెంటు బిల్లు ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు:

2010 నుంచి అంబానీ కుటుంబం ఆంటిలియాలో నివసిస్తోంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, సెప్టెంబర్ 2010లో ఆంటిలియాలో 6,37,240 యూనిట్ల విద్యుత్ వినియోగించారట. దీని కోసం విద్యుత్ బిల్లు దాదాపు రూ. 70,69,488 వచ్చింది. ఆ సమయంలో ముంబైలో ఇది అతిపెద్ద నివాస విద్యుత్ బిల్లుగా పరిగణించారు. అయితే అప్పట్లోనే ఇంత కరెంటు బిల్లు వస్తే ప్రస్తుతం ఎక్కువగా ఉండవచ్చు.ఈ ఖర్చు సాధారణ ఇళ్ల కంటే ఎంత ఎక్కువ?
అవసరమైన అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్న సగటు భారతీయ ఇల్లు నెలలో దాదాపు 300 యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తుంది. అంటే, అంబానీ కుటుంబం విద్యుత్ బిల్లు దాదాపు 7,000 సాధారణ ఇళ్ల మొత్తం విద్యుత్ బిల్లుకు సమానం.

ఇది కూడా చదవండి: Horoscope: ఈ రాశి వారికి సెప్టెంబర్‌లో ఎన్నో ఒడిదుడుకులు.. ఆ సమస్యలు పరిష్కారం!

అధిక వినియోగానికి కారణాలు:

భవనంలోని హై-ఎండ్ ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ, మల్టీపుల్ పార్కింగ్ సౌకర్యాలు, ఇతర అత్యాధునిక సాంకేతికతలు ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తాయి.

ఇది కూడా చదవండి: DMart vs Reliance Retail: డిమార్ట్ vs రిలయన్స్ రిటైల్.. చౌకైన షాపింగ్‌ కోసం ఏది బెస్ట్‌?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment