వినాయక చవితి వచ్చిందంటే రాష్ట్రంలో ఏ వీధి చూసినా ఆధ్యాత్మిక శోభతో అలరారుతుంది. కేవలం పూజలే కాకుండా ప్రతిమలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ.. మండపాల నిర్వాహకులు తమ అభిరుచిని చాటుతున్నారు. ఈ క్రమంలోనే వివిధ ఆకృతులతో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుని విగ్రహాలు అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఎక్కడ లేని విధంగా తమ గణనాథుడు ఆకర్షణీయంగా ఉండాలని, కళాకారులు తమ సృజనాత్మకతకు మెరుగులద్ది సరికొత్తగా ప్రత్యేక గణనాథుని రూపొందించారు కర్నూలు జిల్లాకు చెందిన వినాయక మండపం నిర్వాహకులు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో వినాయక చవితి వచ్చిందంటే చాలు ఆ మండపం వారు ఎటువంటి గణనాథుని ప్రతిష్టిస్తారో.. ఎప్పుడు చూద్దామని ప్రజలు ఎదురుచూస్తుంటారు. కొండవీటి ప్రాంతంలో గత 34 సంవత్సరాల నుండి ప్రతిష్టించే గణనాథుడిని ప్రతి సంవత్సరం పూజకు వినియోగించే వస్తువులతో ఒక్కో వెరైటీతో తయారు చేస్తూ వారు ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ సంవత్సరం చాలా అరుదుగా దొరికే వింజమార ఈకలు, అయ్యప్ప మాల వేసే రుద్రాక్షలతో మారుతి రూపంలో వినాయక విగ్రహంను తయారు చేశారు. ఈ సామాగ్రిని మొత్తం కూడా భద్రాచలం, శ్రీశైలం, మంత్రాలయం మొదలైన పుణ్యక్షేత్రాల నుండి తెచ్చి ఇక్కడ వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు.
వీడియో చూడండి..
తాము గత 34 సంవత్సరాల నుండి వినాయక చవితి వేడుకలు జరుపుతున్నామని ఈ వినాయక మండలి సభ్యుడు తెలుగు రాముడు తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో విగ్రహాలు పెట్టడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, అందుకే ప్రతి సంవత్సరం మట్టి గణనాథుని ఏర్పాటు చేసి తమ వంతుగా పర్యావరణాన్ని కాపాడుతున్నామని అన్నారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా వివిధ పుణ్యక్షేత్రాల నుండి వింజమార ఈకలు, అయ్యప్ప మాల వేసే రుద్రాక్షలు, పూసలు తెప్పించి మట్టి గణపతిని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. విగ్రహం తయారీకి సుమారు రెండు నెలలు పట్టిందన్నారు. ఈ తయారీ విధానం కు మూడు లక్షల రూపాయలు ఖర్చయిందని నిర్వాహకులు తెలిపారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..