కాదేది కవితకు అనర్హం అన్న చందంగా ఏ రూపంలో అయినా ఒదిగిపోయే గణనాథులను తయారు చేసి. తమ భక్తిని చాటుకుంటున్నారు కొంతమంది ఔత్సాహికులు. తమకు నచ్చిన రూపంలో వినాయకుడి విగ్రహం రూపొందించి. ఔరా అనిపిస్తున్నారు. అలాగే అనంతపురం జిల్లాకు చెందిన ఒక కళాకారుడు సైతం వినూత్న రీతిలో గణపయ్యను తయారు చేశాడు. రకరకాల షాంపూ ప్యాకెట్లు, సబ్బు బిళ్ళలతో ఈ కళాకారుడు తయారు చేసిన వినాయకుడి విగ్రహం ప్రస్తుతం భక్తులందరినీ ఆకర్షిస్తుంది.
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా పామిడి పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాగతేజ ప్రతి సంవత్సరం వెరైటీ గణనాథులను తయారు చేస్తుంటాడు. పర్యావరణానికి హాని కలిగించని గణనాధులను తయారు చేయటం నాగ తేజ ప్రత్యేకత. అయితే ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా నాగతేజ వెరైటీ గణనాథుడిని రూపొందించాడు. రకరకాల షాంపూ ప్యాకెట్లు, సబ్బు బిళ్ళలతో వినాయకుడి విగ్రహాన్ని తయారుచేసి మరోసారి తన భక్తిని చాటుకున్నాడు. దాదాపు 30 వేల రూపాయలు ఖర్చు చేసి షాంపూ ప్యాకెట్లు, ఒంటి సబ్బులతో తయారు చేసిన వినాయకుడి విగ్రహాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.
అయితే నిమజ్జనం రోజు వినాయకుడి విగ్రహానికి ఉపయోగించిన షాంపూ ప్యాకెట్లు, ఒంటి సబ్బులను ప్రజలకు ఉచితంగా పంచుతానంటున్నట్టు నాగ తేజ తెలిపాడు. గతంలో కూడా చాక్లెట్లు, బిస్కెట్లు, నాణేలతో, కొబ్బరికాయలతో ఇలా రకరకాల వినాయకుడి విగ్రహాలు తయారు చేసి పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్న శిల్పి నాగ తేజను అందరూ అభినందిస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.