Jagan’s Ganapati Puja: భారతి లేకుండా జగన్ గణపతి పూజ.. టిడిపి నేతల ప్రశ్నల వర్షం?

Jagan’s Ganapati Puja: విలేకర్ల సమావేశాలు.. వివిధ ప్రాంతాల్లో పర్యటనలను మినహాయిస్తే వైసిపి అధినేత జగన్ చాలా రోజుల తర్వాత బయటికి వచ్చారు. ఈసారి ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా నిశ్శబ్దంగా ఉన్నారు. ఆయన వెంట పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు.. అయితే ఆయన నిశ్శబ్దంగా ఉండడానికి ప్రధాన కారణం వినాయక చవితి. ఈ పండుగను పురస్కరించుకొని బుధవారం వైసీపీ అధినేత పూజల్లో పాల్గొన్నారు. తాడేపల్లి లోని తన నివాసంలో ఏర్పాటుచేసిన వినాయక చవితి వేడుకల్లో జగన్ పాల్గొని పూజలు చేశారు. జగన్ వెంట వైసీపీ లోని కీలక నాయకులు ఉన్నారు.

Also Read: జగన్ హయాంలో అవినీతి.. సన్నిహిత నేత సంచలన ఆరోపణలు!

జగన్ వినాయక చవితి వేడుకల్లో పాల్గొనడం.. స్వామి వారికి పూజలు చేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ టిడిపి నేతలు ఊరుకోరు కదా. పైగా ఇప్పుడు ఏపీలో దేశం, ఫ్యాన్ కార్యకర్తల మధ్య బీభత్సమైన యుద్ధం జరుగుతోంది. ఫ్యాన్ పార్టీలో కీలక నాయకులు విమర్శలు చేయడం.. దానికి దేశం నేతలు ప్రతి విమర్శలు చేయడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిపోయింది. దీంతో ఒకరకంగా ఏపీలో ఎన్నికల వాతావరణానికి మించిన వేడి అక్కడి రాజకీయాల్లో కొనసాగుతోంది. ఇది ఎంతవరకు దారి తీస్తుందో తెలియదు కానీ.. ఇప్పటికైతే వ్యవహారం ఉప్పు నిప్పు మాదిరిగానే కొనసాగుతోంది. దీంతో జగన్ వేసే అడుగులను టిడిపి.. బాబు వేసే అడుగులను వైసిపి అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. ఏ మాత్రం లోపం దొరికినా.. తగ్గేది లేదు అన్నట్టుగా విమర్శలు చేస్తున్నాయి.

దీనికి సమాధానం ఉందా..?

జగన్ గణపతి పూజ చేయడాన్ని గొప్ప విశేషంగా వైసిపి నేతలు చెబుతుంటే.. ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడ ఉంది అంటూ టిడిపి నేతలు సవాల్ విసురుతున్నారు. ఎందుకంటే గణపతి దేవుడికి చేసే పూజను ఆది పూజ అంటారు. ఈ పూజలో వివాహం జరిగిన వారు సతీసమేతంగా పాల్గొనాలి. వినాయక వ్రత విధానం పుస్తకంలో కూడా అదే ఉంది. అయితే జగన్ కేవలం ఒక్కడే వినాయకుడి పూజలో పాల్గొన్నారు. పైగా కొబ్బరికాయను కూడా సరిగా కొట్టలేకపోయారు. దీనినే టిడిపి నేతలు గట్టిగా పట్టుకున్నారు. “జగన్ ఏ దేవుడిని ఆరాధిస్తారో అందరికీ తెలుసు. ఇప్పుడు అధికారం కోల్పోయాడు కాబట్టి ఓ వర్గం మనసు చూరగొనడానికి ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి తిరుమల వెళ్లవలసిన అతను అప్పటికప్పుడు రద్దు చేసుకున్నారు. దానికి కారణమేమిటో చెప్పలేదు. ఇప్పుడు వినాయకుడి పూజలో ఒక్కడే పాల్గొన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన తాడేపల్లి ప్యాలెస్ లో తిరుమల సెట్టింగ్ వేసుకున్నారు. కనీసం ప్రసాదం కూడా తినలేదు. అటువంటి వ్యక్తి స్వామి వారికి పూజ చేయడం.. అది కూడా భార్య లేకుండా చేయడం ఏ విలువలకు నిదర్శనమో వైసిపి నేతలు చెప్పాలని” టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఇలాంటి పూజల వల్ల ఫలితం దక్కకపోగా మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని వారు హెచ్చరిస్తున్నారు. మరి దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Leave a Comment