అందంగా కనిపించాలని ఎవరు కోరుకోరు చెప్పండి. ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ముఖారవిందం కోసం ఖరీదైన సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. మరికొందరు ఇంట్లోనే సహజ పద్ధతుల్లో మెరిసే చర్మం కోసం హోమ్ రెమెడీస్ వినియోగిస్తారు.
చాలా మంది అమ్మాయిలు తమ చర్మం గులాబీ రంగులో ఉండాలని కోరుకుంటారు. మీకు కూడా గులాబీ రంగులో మెరిసే చర్మాన్ని కావాలని కోరుకుంటే వెంటనే ఈ కూరగాయతో ఫేస్ ప్యాక్ ట్రై చేయండి. కొన్ని రోజుల్లోనే భలే మార్పు చూస్తారు.
బీట్రూట్తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ మెరిసే చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రకమైన ఫేస్ ప్యాక్ ముఖంపై ఉన్న మచ్చలను తొలగించడంతోపాటు, ముఖంలో వచ్చే మార్పును కొన్ని రోజుల్లోనే గమనిస్తారు.
చర్మం పొడిబారి, ఎండిపోయి ఉంటే బీట్ రూట్ ఫేస్ ప్యాక్‌తో తిరిగి చర్మ సౌందర్యాన్ని పునరుద్ధరించవచ్చు. ముందుగా బీట్రూట్ తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి, మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ మాదిరి చేసుకోవాలి. ఈ మిశ్రమంలో పాలు కలిపి చిక్కని పేస్ట్ లా తీయారు చేసుకోవాలి.
అనంతరం ఈ పేస్ట్‌ను ముఖం, మెడపై అప్లై చేయాలి. అరగంట సేపు ఉంచుకుని తర్వాత సాధారణ నీటితో కడిగేయాలి. ఇది మీ చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. అలాగే ఒక టీస్పూన్ తమలపాకు పొడి, రెండు టీస్పూన్ల పచ్చి పాలు, అర టీస్పూన్ బాదం నూనె బీట్రూట్ పేస్ట్‌లో కలిపి ముఖానికి రాసుకుంటే పొడి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
[