ఇజ్రాయిల్‌తో తెగతెంపులు

. గ్రీస్‌ ప్రజల డిమాండ్‌
. భారీ ర్యాలీలు
. కమ్యూనిస్టు పార్టీ, కార్మిక సంఘాల మద్దతు

ఏథెన్స్‌: ఇజ్రాయిల్‌తో సంబంధాలు తెంచుకోవాలన్న డిమాండ్‌ గ్రీస్‌ అంతటా మార్మోగింది. గాజాలో ఇజ్రాయిల్‌ దురాక్రమణను నిలిపివేయాలంటూ గ్రీస్‌ ప్రజలు ఒక్కటయ్యారు. మారణహోమాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఇజ్రాయిల్‌తో పూర్తిగా తెగతెంపులు చేసుకోవాలని గ్రీస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పలస్తీనాకు విముక్తి కల్పించాలని, అన్ని కారిడార్లు తక్షణమే తెరవాలని, పలస్తీనియన్లకు సహాయం అందేలా చూడాలని నినాదాలు చేస్తున్నారు. పలస్తీనాకు మద్దతుగా వేలాది మంది వీధుల్లోకి వచ్చి భారీస్థాయిలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. గ్రీస్‌లోని ప్రధాన నగరాల్లో ర్యాలీలు జరిగాయి. పలస్తీనాకు అనుకూలంగా, ఇజ్రాయిల్‌కు, గ్రీస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. కార్మిక సంఘాలతో పాటు గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ (కేకేఈ) సంపూర్ణ మద్దతిచ్చింది. ‘పలస్తీనా ప్రజలను పస్తులు ఉంచి చంపేస్తున్నారు… వారి భూభాగంలోకి వెళ్లి మారణహోమం సృష్టిస్తున్నారు. ఇటువంటి యుద్ధ నేరస్తుడికి గ్రీస్‌ ప్రభుత్వం మద్దతు ఇస్తుండటం ఆమోదయోగ్యం కాదు. ఇదంతా తక్షణమే ఆగిపోవాలి. హంతక దేశంతో అన్ని సంబంధాలు తెంచుకోవాలి’ అని ఏథెన్స్‌ ర్యాలీలో పాల్గొన్న కేకేఈ ప్రధాన కార్యదర్శి దిమిత్రిస్‌ కౌట్సోంబస్‌ ఉద్ఘాటించారు. ఆల్‌ వర్కర్స్‌ మిలిటెంట్‌ ఫ్రంట్‌ (పీఏఎంఈ) కూడా వ్యతిరేక గళం వినిపించింది. యూరోపియన్‌ దేశాలు, అమెరికా, నాటో కలిసి ఇజ్రాయిల్‌కు మద్దతివ్వడాన్ని తీవ్రంగా ఖండిరచింది. వేలాది మంది మహిళలు, పిల్లల ఊచకోతకు సహకారాన్ని ఆక్షేపించింది. పలస్తీనాకు సంఫీుభావం ప్రకటించింది. పలస్తీనాకు మద్దతివ్వడం నేరమన్నట్లుగా యూరప్‌ చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘ఐడీఎఫ్‌ హంతకులకు గ్రీస్‌ పోర్టులో అడుగు పెట్టనివ్వం… కార్మిక నగరంలో కాలు మోపనివ్వం’ అంటూ పీఏఎంఈ ప్రకటించింది. అమాయక పిల్లలు, గాజా పౌరులను హతమార్చే యుద్ధ నేరస్తులకు పర్యాటక ప్రాంతంగా గ్రీస్‌ను మారనివ్వబోమని సంకల్పించింది. తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం, న్యాయం, స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న పలస్తీనా ప్రజలకు సంఫీుభావం తెలుపుతున్నామని నిర్మాణ కార్మికుల సమాఖ్య నాయకుడు వాల్సమోస్‌ సిరిగోస్‌ ఉద్ఘాటించారు. సంకల్పముంటే ఏది అసాధ్యం కాదని పలస్తీనా ప్రజలు గత రెండేళ్లుగా నిరూపిస్తున్నారన్నారు. కాళ్లకు చెప్పులు లేకపోయినాగానీ ప్రపంచంలోనే అత్యంత కిరాతక యుద్ధ యంత్రాన్ని ఎదుర్కోగలమని, మాతృభూమిని పరిరక్షించుకోవడం కోసం పోరాడగలమని రుజువు చేస్తున్నారని సిరిగోస్‌ వెల్లడిరచారు.

The post ఇజ్రాయిల్‌తో తెగతెంపులు appeared first on Visalaandhra.

Leave a Comment