Director Sensational comment on Mahesh: గత కొన్ని సంవత్సరాల నుంచి ఇతర భాషల హీరోలు చేస్తున్న క్యారెక్టర్లు మన హీరోలు చేయలేరంటూ చాలా రకాల విమర్శలనైతే ఎదుర్కొంటున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ మధ్యకాలంలో మన స్టార్ హీరోలు సైతం డిఫరెంట్ క్యారెక్టర్లను చేయడానికి ఆసక్తిని చూపిస్తూ ముందుకు సాగుతున్నారు…ఒకప్పుడు తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న విక్రమ్, విశాల్, సూర్య లాంటివారు రాస్ట్రీక్ కథలను సినిమాలుగా చేస్తూ మంచి విజయాలను అందుకున్నారు. అలాగే డిఫరెంట్ పాత్రలకు పెట్టింది పేరుగా మారారు. మరి ఇలాంటి సందర్భంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక స్టార్ డైరెక్టర్ సైతం తనకు మహేష్ బాబు తో సినిమా చేసే అవకాశం వస్తే అతన్ని శవాల ముందు డ్యాన్సులు వేసే వాడిగా చూపిస్తాను. అంటూ ఒక సంచలన ప్రకటన అయితే చేశాడు. ఆయన అలా అనడానికి కారణం ఏంటంటే మన హీరోలు కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే చేస్తారు…డి గ్లామర్ పత్రాలను చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించారు. కాబట్టి ఒకసారి అలాంటి పత్రాలను కూడా చేయిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయాన్ని తెలియజేశాడు…ఇక ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అలాంటి కామెంట్స్ చేసిన దర్శకుడు ఎవరు అంటే ‘నిర్బంధం’ అనే ఒక యూట్యూబ్ సినిమాతో మంచి పాపులారిటీని సంపాదించుకున్న బండి సరోజ్ కుమార్ గా తెలుస్తోంది. ఈయన గతంలో పలువురు హీరోలకు కథలను కూడా వినిపించారట.
కానీ ఆయా హీరోలు ఆ కథలను రిజెక్ట్ చేయడంతో అతనే హీరోగా మారి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు యూట్యూబ్ లో ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు చాలామంది ఆయన సినిమాలను చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
మరి ఇలాంటి సందర్భంలోనే గత సంవత్సరం వచ్చిన ‘పరాక్రమం’ అనే సినిమాతో ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయాడు. కారణం ఏదైనా కూడా ఆయన ఇప్పుడు థియేటర్ లో సినిమాని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
మరి ఏది ఏమైనా కూడా ఈయన నుంచి వచ్చే సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయని సగటు ప్రేక్షకులందరిని మెప్పిస్తూ ఉంటాయని చాలామంది చెబుతూ ఉంటారు. మరి దానికి తగ్గట్టుగానే మంచి కథలను రాసుకొని సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…