Vijayasai Reddy Tweet: ఒకప్పుడు ఆయన ట్వీట్లు మిస్సైళ్ళు.. ఇప్పుడు తుస్సు బాంబులు.. ఎందుకిలా?

Vijayasai Reddy Tweet: మందులకు ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టే.. రాజకీయ నాయకులకు కూడా ఉంటుంది. కాకపోతే రాజకీయ నాయకులు చేసే రాజకీయాల ఆధారంగానే వారి మనగడ ఆధారపడి ఉంటుంది. రాజకీయాలలో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. అవి అనేకసార్లు నిరూపితం అయ్యాయి. ఇప్పుడు ఈ రాజకీయ నాయకుడి విషయంలో కూడా నిరూపితం అవుతోంది. ఇంతకీ ఆయన ఎవరు.. ఏం జరిగింది.. ఎందుకీ చర్చ అంటే..

Also Read: అజిత్ దోవల్ చాతుర్యం: సిక్కింను భారత్‌లో కలిపిన ఓ గూఢచారి గాథ

వైసిపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాలంలో విజయసాయిరెడ్డి రెండవ స్థానంలో ఉండేవారు. అప్పట్లో ఆయన రాజ్యసభకు ఎంపిక అయ్యారు. ఆయన ఎంత చెబితే అంత అన్నట్టుగా జగన్ వ్యవహరించేవారు. వైసిపి అనుకూల మీడియా విజయసాయిరెడ్డిని నిత్యం ఆకాశానికి ఎత్తేస్తూ ఉండేది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ చేస్తే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనంగా ఉండేది. కొన్ని సందర్భాలలో ఆయన చేసిన ట్వీట్లు వార్తాంశాలుగా.. వార్త కథనాలుగా ఉండేది. ఆయన నిత్యం ఏదో ఒక విషయాన్ని బయట పెడుతూ ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపించేవారు. కొన్ని సందర్భాలలో ఆయన మాటల కంటే చేసిన ట్వీట్లే నిప్పు శకటాలుగా ఉండేవి. రోజులన్నీ ఒకే తీరుగా ఉండవన్నట్టుగా.. ఆయన రాజకీయ పరిస్థితి కూడా మారిపోయింది. అప్పటిదాకా వైసీపీలో రెండవ స్థానాన్ని అనుభవించిన ఆయన తన ప్రాభవాన్ని కోల్పోవడం మొదలుపెట్టారు. జగన్ కూడా ఆయనను దూరం పెట్టారు. దీంతో ఆయన రాజకీయాలనుంచి బయటకు వచ్చారు. ఇంకా రెండు సంవత్సరాల పదవీకాలం ఉన్నప్పటికీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రిజైన్ చేశారు. మొత్తంగా రాజకీయాలనుంచి పక్కకు తప్పుకున్నారు.

అసలు జరిగింది ఇది

ఇక ఇటీవల ఏపీలో వెలుగులోకి వచ్చిన మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డి దర్యాప్తు సంస్థకు పలుమార్లు వాంగ్మూలాలు ఇచ్చారు. అయితే ఆయన బిజెపిలోకి వెళ్తారని.. ఆయన కుమార్తె రాజ్యసభ సభ్యత్వం దక్కుతుందని ప్రచారం జరిగింది. ఈలోగానే చంద్రబాబు చక్రం తిప్పారని.. జగన్ ఆస్తుల విషయంలో అప్రూవర్ గా మారితేనే ఇదంతా జరుగుతుందని చంద్రబాబు అల్టిమేటం ఇచ్చారు. ఫలితంగా విజయసాయిరెడ్డి పునరాలోచనలో పడ్డారు. దీంతో ఆయన వ్యవసాయం చేసుకుంటానని అప్పట్లో ఒక ట్వీట్ కూడా చేశారు.. అయితే ఆయన ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు అనే విషయాలపై ఇప్పటికి ఒక క్లారిటీ లేదు. కాకపోతే ఒకప్పుడు ఆయన చేసిన ట్వీట్లు మిస్సైల్స్ లాగా ఉండేవి. ఇప్పుడు మాత్రం తుస్సు బాంబుల్లాగా ఉంటున్నాయి. అందుకే అంటారు ఏనుగు మీద దుమ్ము ఎవరూ పోయాల్సిన అవసరం లేదని.. ఇప్పుడు విజయసారెడ్డి విషయంలో అది నిజమైంది. నిరూపితమైంది.

Leave a Comment