Senior Leader ultimatum to Jagan: నచ్చిన సీటు ఇవ్వాల్సిందే.. జగన్ కు సీనియర్ అల్టిమేటం!

Senior Leader ultimatum to Jagan: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో ధిక్కార స్వరాలు ప్రారంభం అయ్యాయి. పార్టీకి ఓటమి ఎదురైన తర్వాత చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయారు. ఉన్నవారు సైలెంట్ అయ్యారు. అయితే పార్టీని బలోపేతం చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి కీలక నియామకాలు చేపట్టారు. కొందరినీ పార్లమెంటరీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో కొందరిని నియోజకవర్గాల ఇన్చార్జిల నుంచి తప్పించారు. అయితే పార్లమెంటరీ ఇంచార్జ్ కంటే అసెంబ్లీ ఇన్చార్జి పదవికి ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో తాము బాధ్యతలు నిర్వర్తించేది లేదు అంటూ తేల్చి చెబుతున్నారు. ఎన్నికలకు ముందు నియోజకవర్గాలను మార్చినా నేతలు నోరు తెరవలేదు. కానీ ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత అదే మార్పును వ్యతిరేకిస్తున్నారు. ఇలాగైతే బాధ్యతలు తీసుకోలేమని హై కమాండ్ పెద్దల వద్దే తేల్చి చెబుతున్నారు. అయితే ఇలా మాట్లాడుతున్న నేతలకు ప్రత్యామ్నాయ పార్టీలు లేవు. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అలాగని బలవంతంగా తమకు వేరే నియోజకవర్గం అప్పగించడం పై వారు వ్యతిరేకిస్తున్నారు.

విజయవాడ ఇన్చార్జిగా నియామకం
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని( modhugula Venugopal Reddy ) నియమించారు జగన్మోహన్ రెడ్డి. అయితే విజయవాడ వెళ్లేందుకు, ఆ బాధ్యతలు చూసేందుకు ససేమీరా అంటున్నారు వేణుగోపాల్ రెడ్డి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యతలు అప్పగించినా.. తీసుకోకపోయినా వారి గురించి ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఈ క్రమంలో వేణుగోపాల్ రెడ్డిపై సీరియస్ అయ్యారు. తప్పకుండా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. ఇదే విషయంపై పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి వేణుగోపాల్ రెడ్డి ని పిలిచి మాట్లాడారు. సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే తాను గుంటూరు కానీ.. నరసరావుపేట పార్లమెంట్ స్థానం గానీ అడిగితే.. విజయవాడ పార్లమెంటరీ బాధ్యతలు ఇవ్వడం ఏంటని సజ్జల రామకృష్ణారెడ్డిని నిలదీసినంత పని చేశారు. పార్టీ అధినేత ఆదేశాలు.. పార్టీ లైన్ లోబడి మాత్రమే వ్యవహరించాల్సి ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. దీంతో అధినేత జగన్మోహన్ రెడ్డి పై ధిక్కార స్వరం వినిపించేందుకు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సిద్ధపడినట్లు తెలుస్తోంది.

Also Read: మూడు రోజులు విశాఖలో సేనతో సేనాని పవన్ కళ్యాణ్

టిడిపి ద్వారా ఎంట్రీ..
మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2009 ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంటరీ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2014లో జరిగిన ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2019 ఎన్నికల కు ముందు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి.. టిడిపి అభ్యర్థి గల్లా జయదేవ్ చేతిలో ఓడిపోయారు. అయితే వైసిపి హయాంలో ఎటువంటి గుర్తింపు ఆయనకు దక్కలేదు. ఏ పదవి ఇవ్వలేదు. 2024 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ టికెట్ ఆశించారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. వేణుగోపాల్ రెడ్డి ది గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెద్దపెరిపి. టిడిపిలో ఉండి ఉంటే మంచి భవిష్యత్తు ఉండేదని.. అనవసరంగా వైసీపీలోకి వచ్చానని వేణుగోపాల్ రెడ్డి తన అనుచరుల వద్ద బాధపడుతున్నారట. ఒకవేళ గుంటూరు కానీ.. నరసరావుపేట కానీ బాధ్యతలు ఇవ్వకుంటే ఆయన తీవ్ర నిర్ణయం దిశగా అడుగులేసే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Leave a Comment