Chiranjeevi T-Rex movie Story: చిరంజీవి తో చేస్తున్న T-Rex మూవీ కథ ను చెప్పేసిన శ్రీకాంత్ ఓదెల… మామూలుగా లేదుగా…

Chiranjeevi T-Rex movie Story: తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి కి వెళ్లిపోయింది. ఇండియాలో నెంబర్ వన్ ఇండస్ట్రీ గా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ కొనసాగుతోంది. మరి ఇలాంటి సందర్భంలోనే కొత్త డైరెక్టర్లు సైతం వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉందని సగటు సినిమా అభిమానులు సైతం వాళ్ళను హెచ్చరిస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకుడు సైతం మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించాడు. ఇక ఇప్పుడు చేస్తున్న ప్యారడైజ్ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలని తీవ్రమైన ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చిరంజీవితో T – Rex అనే టైటిల్ తో ఒక సినిమాను అనౌన్స్ చేశాడు…T – Rex అంటే ‘టైరన్నోసారస్’ అనే ఒక అరుదైన జాతికి చెందిన డైనోసర్…ఇది అడవి మొత్తాన్ని శాసిస్తుంది… ఇక ఈ సినిమాకి శ్రీకాంత్ అలాంటి ఒక పవర్ఫుల్ టైటిల్ ని పెట్టాడు అంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక గ్యాంగ్ స్టర్ గా చిరంజీవి ఈ సినిమాలో కనిపిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ కథను బట్టి చూస్తే ఒక పెద్ద మాఫియా సామ్రాజ్యానికి చిరంజీవి అధిపతి గా ఉంటాడట.

ఎంత పెద్ద డాన్ అయినా సరే చిరంజీవి కిందే ఉంటారట. అలాంటి ఒక పవర్ఫుల్ డాన్ కి బిజినెస్ లో శత్రువులుగా మారిన వాళ్లతో ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి. తన అడవిలోకి ఎంటర్ అయితే డైనోసార్లు ఎలా వాళ్ళని చంపేస్తాయో చిరంజీవి సైతం తన సామ్రాజ్యంలోకి వచ్చిన వాళ్లను ఎదిరించి తన ఉనికిని ఎలా నిలుపుకున్నారు అనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది.

ఇక ఇందులో చిరంజీవికి పెళ్లై ఒక కొడుకు కూడా ఉంటారట. మరి ఇందులో చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా చిరంజీవి మరోసారి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

మరి ఇలాంటి సందర్భంలోనే కొంతమంది సినిమా మేధావులు సైతం చిరంజీవి ప్రస్తుతం రొటీన్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకుడికి ఛాన్స్ ఇచ్చి మంచి పని చేశాడని చెబుతున్నారు. ఎందుకంటే ఆయన చిరంజీవిని చాలా గొప్పగా చూపించే ప్రయత్నం చేయబోతున్నాడు అనేది ఆ టైటిల్ ని బట్టి చూస్తేనే అర్థమవుతోంది అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…

Leave a Comment