అనుష్క కెరియర్ ను స్పాయిల్ చేసింది ఎవరు..? ఆమెందుకు

Anushka Shetty Career: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నటి అనుష్క… మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. అప్పటినుంచి ఇప్పటివరకు ఆమె వరుస సినిమాలను చేస్తూ మంచి విజయాలను సాధిస్తున్నారు. ముఖ్యంగా అరుంధతి, బాహుబలి లాంటి సినిమాలు ఆమె కెరియర్ ను ఒక్కసారిగా టాప్ లెవల్ కి తీసుకెళ్ళాయి… మరి ఇలాంటి నటి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ ను సంపాదించుకుంది. అయినప్పటికి ఆమె అప్పటినుంచి పెద్దగా సినిమాలైతే చేయడం లేదు… ఇక ప్రస్తుతం ఆమె క్రిష్ డైరెక్షన్లో ఘాటి అనే సినిమా చేసింది. ఈ మూవీ సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సందర్భంలోనే ఈ సినిమాతో ఆమె ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది అనేది తెలియాల్సి ఉంది…ఇక ఆమె అభిమానులు మాత్రం బాహుబలి సినిమా అంత గొప్ప విజయాన్ని సాధించినప్పటికి ఆమె ఆ సినిమా తర్వాత పెద్దగా సినిమాలు చేయడం లేదు.దానికి కారణం ఏంటి అంటూ కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి…నిజానికి ఆమె సైజ్ జీరో అనే సినిమా చేయడం వల్ల భారీగా లావైపోయింది. దానివల్ల ఆమె పెద్దగా సినిమాలకైతే కమిట్ అవ్వలేకపోతోంది.

Also Read: ఓటీటీ లోకి వచ్చేసిన ‘కింగ్డమ్’ మూవీ..ఎందులో చూడాలంటే!

ఒకవేళ కొన్ని సినిమాలు చేసినా కూడా సీజీలో ఆమెను స్లిమ్ గా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి దీనికి చెక్ పెడుతూ ఆమె వీలైనంత తొందరగా సన్నబడాలని చూస్తోంది. అందుకోసమే డైట్ ని మైంటైన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకరకంగా ‘సైజ్ జీరో’ సినిమాతో రాఘవేంద్రరావు కొడుకు అయిన ప్రకాష్ ఆమె సినిమా కెరియర్ ని స్పాయిల్ చేశారనే చెప్పాలి. సైజ్ జీరో సినిమా డిజాస్టర్ గా మారింది.

ఆ సినిమా కోసం అనుష్క ను విపరీతంగా వెయిట్ పెరిగేలా చేశాడు. ఇక అప్పటినుంచి ఆమె కోల్కోలేక పోతోంది. ఏమాత్రం సన్నగా అవుదాం అనుకున్నా కూడా ఆమెకు హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నట్టుగా తెలుస్తున్నాయి. అందువల్లే ఆమె అప్పటినుంచి ఇప్పటివరకు సెలెక్టెడ్ గా కొన్ని సినిమాలను మాత్రమే చేసుకుంటూ ముందుకు సాగుతోంది…

ఇక తన తోటి హీరోయిన్స్ అయిన త్రిష, నయనతార వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తుంటే ఈమె మాత్రం అడపదడప సినిమాలను చేయడం పట్ల ఆమె అభిమానులు కొంతవరకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు…నిజానికి వాళ్లతో పోలిస్తే అనుష్కకి చాలా మంచి మార్కెట్ అయితే ఉంది. కానీ ఆ మార్కెట్ ను ఆమె వాడుకోవడం లేదు. మరి ఫ్యూచర్లో అయిన ఆమె స్లిమ్ అయి మరిన్ని మంచి సినిమాలు చేస్తుందా? లేదా అనేది చూడాలి…

Leave a Comment