Bigg Boss Telugu 9 Agnipariksh: బిగ్ బాస్ షో మీద ప్రతి ఒక్కరికి చాలా మంచి అంచనాలైతే ఉన్నాయి. గత 8 సీజన్లలో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అయితే అందించిందో ఈ సీజన్ లో అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఈ షో కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే షో యజమాన్యం కూడా ఈ సీజన్ కోసం చాలా వరకు మార్పులు చేర్పులు చేసి ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నమైతే చేస్తుంది. ఒక దానికి తగ్గట్టుగానే బిగ్ బాస్ యాజమాన్యం కూడా సామాన్యులను ఈ షో లో భాగం చేయాలనే ఉద్దేశ్యంతో అగ్ని పరీక్ష అనే మరొక షో ను కండక్ట్ చేస్తోంది. ఇక దీనికి అభిజిత్, నవదీప్, బిందు మాధవి లు జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. మరి ఈ షోలో పాల్గొంటున్న చాలా మంది కంటెస్టెంట్లు వాళ్ళ వాళ్ళ టాలెంట్ ని చూపించుకుంటూ జడ్జెస్ ఇచ్చిన టాస్క్ లను సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేసి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు… అయితే ఆర్మీ పవన్ కళ్యాణ్ అనే ఒక కంటెస్టెంట్ తనకు ఆర్మీ మీద కంటే సినిమా మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పి ఇందులో పాల్గొనడానికి వచ్చాను అని చెప్పాడు. దాంతో అతని కాన్ఫిడెంట్ లెవెల్ ని చూసిన నవదీప్, బిందు మాధవి ఇద్దరు గ్రీన్ మార్క్ ఇవ్వగా అభిజిత్ మాత్రం రెడ్ మార్క్ ఇచ్చాడు.
Also Read: క్రికెట్ లో ఈ కాలపు నయా వాల్.. చటేశ్వర్ పూజార కీలక నిర్ణయం..
కారణం ఏంటంటే నువ్వు ఆర్మీలో జాబ్ చేస్తుండగానే ఇటు బిగ్ బాస్ లో పాల్గొనాలని చూస్తున్నాం అంటే నీ మైండ్ స్టెబుల్ గా ఉండడం లేదు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం లేదు కాబట్టి నీకు రెండు మార్క్ ఇస్తున్నాను అంటూ ఆయన చెప్పిన సమాధానం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది.
ఎందుకంటే బిగ్ బాస్ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఇంతకుముందు ఏదో ఒక జాబ్ గానీ లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా చేసి వచ్చిన వాళ్ళే మరి వాళ్లకు లేని రిస్ట్రిక్షన్స్ ఈయనకు మాత్రం ఎందుకు పెట్టారు. అంటే ఒక జాబ్ నుంచి నెక్స్ట్ లెవల్ కి వెళ్ళాలి అనుకోవడం కన్సిస్టెన్సీ లేకపోవడం అవుతుందా?
అంటూ అభిజిత్ మీద కొంత వరకు నెగెటివిటీ అయితే స్ప్రెడ్ అవుతోంది. మరి ఏది ఏమైనా కూడా అగ్ని పరీక్ష థర్డ్ ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ముగిసింది. ఇక ప్రేక్షకులు ఫోర్త్ ఎపిసోడ్ కోసం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…
[