వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వారమంతా జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కుటుంబ జీవితంలో కూడా సుఖ సంతోషాలకు నెలకొంటాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేపడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ కొద్ది శ్రమతో సఫలం అవుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో వృత్తి, ఉద్యోగాల పరంగా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగి పోతాయి.
