రాజీవ్‌గాంధీ సేవలు మరువలేనివి

Written by RAJU

Published on:

భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

రామన్నపేట, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): దేశ అభ్యున్నతికై దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ చేసిన సేవలు మరువలేనివని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం కొనియాడారు. రామన్నపేట పోలీ్‌సస్టేషన్‌ సమీపంలో కాంగ్రె్‌సనేత, మాజీ ఎంపీటీసీ వనం హర్షిణి చంద్రశేఖర్‌ ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఆదివారం వారు ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీకి, దేశానికి రాజీవ్‌గాంధీ అనేక సేవలు చేశారని, ఆయన ఆశయ సాధనకు కార్యకర్తలు ముమ్మరంగా కృషి చేయాలన్నారు. దేశంకోసం జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రాణాలను త్యాగం చేశారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సిగిరిరెడ్డి మల్లారెడ్డి, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు మొహమ్మద్‌ జమీరుద్దీన్‌, నాయకులు నంద్యాల భిక్షంరెడ్డి, గంగుల రాజిరెడ్డి, జింకల ప్రభాకర్‌, గంగుల కృష్ణారెడ్డి, పున్న రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Subscribe for notification