Job Market: ఫిబ్రవరిలోనూ అదే దూకుడు.. ఫ్రెషర్స్‌ నియామకాల్లో 41 శాతం వృద్ధి!

Written by RAJU

Published on:


Job Market: ఫిబ్రవరిలోనూ అదే దూకుడు.. ఫ్రెషర్స్‌ నియామకాల్లో 41 శాతం వృద్ధి!

భారత్‌ జాబ్‌ మార్కెట్‌లో నియామకాల దూకుడు ఫిబ్రవరి నెలలోనూ కొనసాగింది. ప్రధానంగా ఫ్రెషర్ల నియామకాల్లో ఈ ఏడాది 41 శాతం వృద్ధి నమోదైనట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఫిబ్రవరి నెలలో ఫ్రెషర్స్ నియామకాలు 26 శాతం పెరిగాయి. ఇది కెరీర్‌ ప్రారంభకులకు జాబ్ మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తుందని ఆసియా జాబ్స్‌ అండ్‌ ట్యాలెంట్‌ వేదిక అయిన ఫౌండిట్ పేర్కొంది.

డేటా ప్రకారం గత సంవత్సరంతో పోలిస్తే ఫిబ్రవరి 2025లో నియామకాల్లో 41 శాతం వృద్ధి నమోదైందని నివేదిక పేర్కొంది. తాజా ఉద్యోగ మార్కెట్ స్థిరమైన వృద్ధిని కొనసాగించడం దీనికి కారణం. ఐటీలోని హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ కొత్త నియామకాల్లో ఈ వృద్ధి కనిపిస్తుంది. 2024లో 17 శాతం ఉండగా 2025లో 34 శాతానికి దీని వాటా పెరిగింది. అంటే దాదాపు రెట్టింపు అయిందని నివేదిక తెలిపింది. నైపుణ్యం ఆధారిత నియామకాల వైపు మార్పు రావడం కనిపిస్తుంది. ఆచరణాత్మక నైపుణ్యం, పరిశ్రమ సంబంధిత నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులకు యజమానులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఫౌండైట్ సీఈవో వి సురేష్ అన్నారు.

ఈ మేరకు ఫౌండైట్‌ ప్లాట్‌ఫామ్‌లో ఆన్‌లైన్ ఉద్యోగ పోస్టింగ్ కార్యకలాపాల సమగ్ర నెలవారీ విశ్లేషణ వెల్లడించింది. ఫౌండైట్‌ ఇన్‌సైట్స్ ట్రాకర్ (ఫిట్) ప్రతి నెలా ఈ వివరాలను ట్రాక్‌ చేస్తూ ఉంటుంది. అలాగే Recruitment and Staffing industryలో కూడా ఫ్రెషర్స్‌ నియామకాల్లో వృద్ధిని సాధించిందని నివేదిక వెల్లడించింది. వివిధ డొమైన్‌లలో ఫ్రెష్‌ ట్యాలెంట్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను ఇది హైలైట్ చేస్తుంది. అయితే BFSI, BPO/ITES వంటి రంగాల్లో మాత్రం ఫ్రెషర్స్‌ నియామకాల్లో తగ్గుదల కనిపించింది. ఇది మారుతున్న పరిశ్రమల ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తుంది. ప్రధాన మెట్రోపాలిటన్ ప్రాంతాల కంటే నాసిక్, జైపూర్, సూరత్, కోయంబత్తూర్, ఇండోర్, కొచ్చి, థానే, వడోదర, చండీగఢ్, నాగ్‌పూర్ వంటి టైర్ 2 సిటీలు కొత్త ఉద్యోగ అవకాశాలకు కీలకమైన ప్రదేశాలుగా అభివృద్ధి చెందుతున్నట్లు నివేదిక తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Subscribe for notification