Hyderabad: గర్ల్స్ హాస్టల్‌లో అనుమానాస్పద వస్తువు.. వెంటనే పోలీసులకు ఫోన్ చేసిన అమ్మాయిలు.. చివరకు.. – Telugu News | Spy Camera Stirs up Trouble in Girls’ Hostel, Ameenpur Police Raid Uncovers Hidden Memory SIM Cards

Written by RAJU

Published on:

ప్రయివేటు హాస్టళ్లలో మరో అరాచకం బయటపడింది. హైదరాబాద్‌ శివారు అమీన్‌పూర్ మున్సిపాలిటీ కిష్టారెడ్డి పేటలోని మైత్రి విల్లాస్‌లో బండారు మహేశ్వర్‌ అనే వ్యక్తి గర్ల్స్‌ హాస్టల్‌ నిర్వహిస్తున్నాడు. సమీపంలోని ఇంజినీరింగ్‌ కాలేజ్‌ స్టూడెంట్స్ ఈ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటన్నారు.. ఈ క్రమంలోనే.. శుక్రవారం ఓ రూమ్‌లో సెల్‌ఫోన్‌ ఛార్జర్‌ లాంటి  అనుమానాస్పద వస్తువు కనిపించింది.. దీంతో అమ్మాయిలు అలర్ట్ అయ్యారు.. హిడెన్‌ కెమెరా పెట్టారనే అనుమానంతో విద్యార్ధినీలు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పై కెమెరా మాదిరి ఉందంటూ వారికి వెల్లడించారు.

Crime News

Crime News

వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు పోలీసులు హాస్టల్ మొత్తం చెక్ చేశారు.. అయితే.. ఈ క్రమంలోనే సెల్‌ఫోన్‌ బ్యాటరీలో సిమ్‌ కార్డులు బయటపడటం సంచలనంగా మారింది.. హాస్టల్‌ నిర్వాహకుడు బండారు మహేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. స్టూడెంట్స్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు అమీన్‌పూర్‌ సీఐ..

వీడియో చూడండి..

కిష్టారెడ్డి పేటకు చెందిన బండారు మహేశ్వర్‌ ..అమీన్‌పూర్‌లోని తన సొంత విల్లాలో గత నాలుగేళ్లుగా గర్ల్‌ హాస్టల్‌ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. హాస్టల్‌లో స్వాధీనం చేసుకున్న చిప్స్‌లో ఎలాంటి వీడియోస్‌ లేవని గుర్తించారు. అయితే.. గతంలో కూడా ఇలా సీక్రెట్‌ కెమెరాలు పెట్టాడా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అన్ని కోణాల్లో ఎంక్వయిరీ చేపట్టిన పోలీసులు..నిజానిజాలు తేల్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని  తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification