Rajinikanth Kamal Haasan Project: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికి సాధ్యం కానీ రీతిలో రికార్డులను క్రియేట్ చేసి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక చెరగని ముద్ర వేసిన నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్… ఆయన చేసిన సినిమాలు మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకోవడమే కాకుండా అతని స్టైల్ కి ఫిదా కాని జనాలు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…కేవలం ఆయన స్టైల్ కే చాలా మంది అభిమానులుగా మారిపోయారు. ఇక అతని సినిమాలను తెలుగులో సైతం డబ్ చేస్తూ రిలీజ్ చేయడం వల్ల తెలుగులో సైతం అతనికి వీరాభిమానులు ఉన్నారు. మరి వాళ్ళ అభిమానాన్ని క్యాచ్ చేసుకుంటూ ఆయన ప్రతిసారి భారీ విజయాలను సాధిస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు…ఇక ఇదిలా ఉంటే రజినీకాంత్ స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకుంటే కమల్ హాసన్ క్లాస్ హీరోగా తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేస్తూ వచ్చాడు. తెలుగులో సైతం ఆయన స్ట్రైయిట్ సినిమాలను చేసి ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఇండియాలో కమల్ హాసన్ లాంటి నటుడు మరొకరు ఉండరు అనంతలా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం…అలాంటి వీళ్లిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే చూడాలని చాలామంది చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. అయినప్పటికి అది ఇప్పటివరకు సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది అంటూ ఒక అనౌన్స్ మెంట్ అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది…ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేసేది కూడా లోకేష్ కనకరాజు గారే కావడం విశేషం…ఇక రీసెంట్ గా రజనీకాంత్ తో కూలీ సినిమాను చేసిన ఆయన ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో కొంతవరకు డీలాపడ్డాడు. అయినప్పటికి ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని మరి ఆయన ముందుకు సాగబోతున్నట్టుగా తెలుస్తోంది…

ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి క్రేజ్ ను సంపాదించి పెట్టాయి. కాబట్టి ఈ ఇద్దరు సీనియర్ హీరోలను కలిపి సినిమా చేసే కెపాసిటి ప్రస్తుతం ఉన్న దర్శకులలో అతనికి మాత్రమే ఉందని కొంతమంది సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు…
ఇక వాళ్ల ఇమేజ్ కు తగ్గట్టుగా కథను రాసి నెక్స్ట్ లెవెల్లో సినిమాను తీయగలిగే దర్శకుడు కూడా తనే కావడం విశేషం… మరి ఇప్పుడు ఆయన ఖైదీ2, విక్రమ్ 2 సినిమాలను చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమాని ముందు స్టార్ట్ చేస్తాడా లేదంటే ఖైదీ 2, విక్రమ్ 2 సినిమాలు చేసిన తర్వాత ఈ సినిమాని స్టార్ట్ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది…
ఇక ఇదిలా ఉంటే మరి కొంతమంది మాత్రం రజినీకాంత్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో మళ్లీ సినిమా చేయడం ఎందుకు అంటూ ఆయన మీద కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు. మరి ఈ ప్రాజెక్టు నిజంగానే ఉంటుందా? లేదంటే ఆగిపోయే అవకాశాలు ఉన్నాయా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…