రాజస్థాన్‌లోని అల్వార్‌లోని జెకె నగర్‌లో అమానుషం చోటు చేసుకుంది. శుక్రవారం(మార్చి 7) సాయంత్రం 6 గంటల ప్రాంతంలో 18 ఏళ్ల బాలిక తన మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలోనే దూసుకువచ్చిన 8 నుండి 10 కుక్కలు ఆమెపై దాడి చేశాయి. కుక్కలు దాదాపు 15 నుండి 20 సెకన్ల పాటు ఆ విద్యార్థిని వదిలి వెళ్ళలేదు. ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో అదివిన్న కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగువారు వచ్చి రక్షించారు. ఆ విద్యార్థిని 8 చోట్ల కుక్కలు కరిచాయి. దీంతో స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.
శనివారం కూడా ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయపడిపోయింది. ఈ సంఘటన తర్వాత, కాలనీ ప్రజలు తనతో కుక్కలను తీసుకువచ్చే ఒక మహిళను తీవ్రంగా మందలించారు. కోపంతో ఆ మహిళ స్కూటర్‌ను కాలనీ వాసులు ధ్వంసం చేశారు. జెకె నగర్‌లోని ప్లాట్ నంబర్ 51లో నివసించే 18 ఏళ్ల నవ్య, మొబైల్‌లో మాట్లాడుతూ ఇంట్లో నుంచి వీధిలోకి వచ్చింది. అప్పుడే వెనుక నుండి కుక్కలు మొరుగుతూ వచ్చాయి. కుక్కలు రాగానే ఆమెపై దాడి చేశాయి. ఒకదాని తర్వాత ఒకటి, దాదాపు 8 నుండి 10 కుక్కలు ఆమెను చుట్టుముట్టాయి. కొన్ని సెకన్ల పాటు ఆమె తన చేతులు, కాళ్ళతో కుక్కలను దూరంగా వెళ్లగొట్టడానికి ప్రయత్నించింది. కానీ కుక్కలు ఆమెనను ముందు నుండి వెనుక నుండి లాగడం ప్రారంభించాయి. దాని కారణంగా ఆమె నేలపై పడిపోయింది. కేకలు విని ఇరుగుపొరుగు వారు బయటకు వచ్చారు. అప్పుడు ఆ వ్యక్తులు ఆ క్రూరమైన కుక్కలను తరిమికొట్టారు. కుక్కల దాడికి నవ్య చాలా భయపడిపోయిందని కుటుంబసభ్యులు తెలిపారు.
నవ్య ఫిజియోథెరపీలో డిగ్రీ చదువుతోంది. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మరో రెండు రోజుల్లో జరగబోతున్నాయి. నవ్య ఇంటికి సమీపంలోని ఇంట్లో ఎవరో కుక్కలను పెంచుకున్నారని స్థానికులు చెప్పారు. అవి నిరంతరం ప్రజలపై దాడి చేస్తాయి. ఫిర్యాదు చేసినప్పటికీ, అధికారులు ఎటువంటి చర్య తీసుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఘటన తర్వాత స్థానికులు సదరు మహిళను నిలదీశారు. కానీ ఆమె నిర్లక్ష్యపు సమాధానానికి స్థానికులు ఆమె వెహికల్‌ను ధ్వంసం చేశారు. కాగా ఈ సంఘటనకు సంబంధించిన CCTV చూసి నెటిజన్లు భయపడుతున్నారు.
వీడియో చూడండి..
राजस्थान के अलवर डराने वाली तस्वीर… आवारा कुत्तों के झुंड ने एक युवती पर हमला कर दिया…घटना JK नगर वार्ड 56 की है…युवती मोबाइल पर बात करते हुए जा रही थी…पीछे से 6 से ज्यादा कुत्तों ने अटैक कर दिया… हमले में युवती गंभीर रूप से घायल. #ALWAR #DogAttack pic.twitter.com/xTOG0Enb40
— ANURAAG ॐ SHARMA 🇮🇳 (@7ANURAGSHARMA) March 8, 2025
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..