CM Revanth Reddy : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ‘ఇందిరా మహిళా శక్తి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్గ, మంత్రులు పాల్గొన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు (2,82,552 సంఘాలు) 22 వేల 794 కోట్ల 22 లక్షల రూపాయల చెక్కును సీఎం అందజేశారు. మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులకు లోన్ బీమా, ప్రమాద బీమా పథకాల ద్వారా రూ.44 కోట్ల 80 లక్షలు అందజేశారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే సోలార్ ప్లాంట్స్ కు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా మహిళాశక్తి మిషన్-2025 పాలసీని ఆవిష్కరించారు.