ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు అసెంబ్లీ లాబీలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, విద్య, ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మధ్య జరిగిన సంభాషన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంత్రి నిమ్మల రామానాయుడు కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ జ్వరం తగ్గలేదు. దాంతో సిలైన్స్ పెట్టించుకుని మరీ ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు. ఈ రోజు కూడా చేతికి ఇంజెక్షన్ కాన్యులా పెట్టుకుని అసెంబ్లీకి హాజరయ్యారు.
కాన్యులాను గమనించిన మంత్రి నారా లోకేష్ `నిన్న ఆ చేతికి ఉంది.. ఇవాళ ఈ చేతికి వచ్చింది. విశ్రాంతి తీసుకుంటారా.. లేక సభ నుంచి సస్పెండ్ చేయించమంటారా..` అంటూ నిమ్మలకు స్వీట్‌గా వార్నింగ్ ఇచ్చారు. పని కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం కరెక్ట్ కాదని.. రెస్ట్ తీసుకోవాలని సూచించారు. నిన్నటితో పోలిస్తే ఇవాళ ఆరోగ్యం బాగానే ఉందని నిమ్మల బదులిచ్చారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని.. ప్రశాంతమైన నిద్రతోనే ఆరోగ్యం కుదుటపడుతుందని మంత్రి లోకేష్ సూచించారు. ఇక అసెంబ్లీలో గోరుగల్లు రిజర్వాయర్ పై సమాధానం ఇచ్చిన సమయంతో మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోగ్యంపై లోకేష్ స్పందించారు. `అన్నకు ఆరోగ్యం బాగోలేదు.. అయినా అసెంబ్లీకి వచ్చేస్తున్నారు. చెప్పినా వినడం లేదు. మీరైనా రూలింగ్ ఇవ్వండి అధ్యక్షా` అంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును లోకేష్ తో కోరారు. ఇంకొంతమంది సభ్యులు కూడా ఆయన మద్దతు ఇచ్చారు. ఇక ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు పనిరాక్షసుడని ప్రశంసిన డిప్యూటీ స్పీకర్.. ప్రజా సేవతో పాటు ఆరోగ్యం కూడా చూసుకోవాలని సూచించారు. అలాగే జ్వరం తగ్గే వరకు అసెంబ్లీకి రావద్దంటూ రఘురామ రూలింగ్ ఇచ్చారు.
The post సస్పెండ్ చేయించాలా.. మంత్రి నిమ్మలకు లోకేష్ వార్నింగ్! first appeared on namasteandhra.