Photo Story: ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరు చిన్నారులు ఎంతో క్యూట్ గా, ముద్దుగా ఉన్నారు కదూ. వీరిలో ఒకరు ఇప్పుడు టాలీవుడ్ లో మంచి హీరో. అందరి హీరోలు లాగానే ఇతను కూడా కమర్షియల్ పద్దతిలో వెళ్లుంటే ఎవ్వరూ అందుకోలేంత రేంజ్ కి వెళ్ళేవాడు. కానీ ఇతను మాత్రం తన మనసుకి నచ్చిన స్టోరీలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళ్ళాడు. తన ప్రతీ సినిమాతో ప్రేక్షకులకు ఎదో ఒక కొత్త అనుభూతి కలిగించాలని తపన పడే హీరోలలో ఒకరు ఈయన. అంతే కాదు ఇతనికి సినీ బ్యాక్ గ్రౌండ్ ఏ రేంజ్ లో ఉందో, రాజకీయ బ్యాక్ గ్రౌండ్ కూడా అదే రేంజ్ లో ఉంది. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా ఎమ్మెల్యే గా పోటీ చేస్తానని రీసెంట్ గానే అధికారికంగా ఒక ఇంటర్వ్యూ లో ప్రకటించాడు కూడా. ఆయన మరెవరో కాదు, నారా రోహిత్(Nara Rohit).
Also Read: విడాకుల బాటలో నడుస్తున్న మరో సీనియర్ హీరోయిన్..పిల్లల్ని పెట్టుకొని ఇవేం పనులో!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం నుండి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈయన కమర్షియల్ హీరో గా వేరే లెవెల్ అని తనని తాను నిరూపించుకోలేదు కానీ, కచ్చితంగా టాలీవుడ్ లో ఒక గొప్ప నటుడు అని మాత్రం నిరూపించుకున్నాడు. ‘బాణం’ అనే చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసిన ఈయన, ఆ తర్వాత ‘సోలో’ చిత్రం తో భారీ కమర్షియల్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. అదే తరహాలో ఆయన తన కెరీర్ ని కొనసాగిస్తూ ముందుకు వెళ్లుంటే నారా ఫ్యామిలీ నుండి కూడా నేడు ఇండస్ట్రీ లో ఒక స్టార్ హీరో ఉండేవాడు. కానీ డిఫరెంట్ తరహా కథలను ఎంపిక చేసుకోవడం, అవి కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడం తో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకోలేకపోయాడు. ఈమధ్య కాలంలో కొంత గ్యాప్ తీసుకున్న నారా రోహిత్, ఇప్పుడు ‘భైరవం’ అనే చిత్రం ద్వారా మన ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద సూపర్ హిట్ అవ్వలేదు కానీ, నారా రోహిత్ క్యారక్టర్ కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం తర్వాత ఆయన సోలో హీరో గా నటించిన ‘సుందరకాండ’ విడుదలకు సిద్ధం గా ఉన్నది. దీంతో పాటు ‘ప్రతినిధి 2’ కూడా రెడీ అవుతుంది. కేవలం హీరోగా మాత్రమే కాకుండా, తన స్నేహితుడు శ్రీవిష్ణు తో కలిసి ఈయన పలు సినిమాలను కూడా నిర్మించాడు. అవి కమర్షియల్ గా వర్కౌట్ అయ్యాయి కూడా. ఇదంతా పక్కన పెడితే 2029 ఎన్నికల్లో నారా రోహిత్ టీడీపీ పార్టీ తరుపున ఎదో ఒక నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసే అవకాశం ఉంది. భైరవం మూవీ ఇంటర్వ్యూస్ సమయం లో ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలిపాడు.