రవితేజ కి ఈ వయస్సులో ఇవేమి పనులు..దిగజారిపోతున్నాడుగా!

Ravi Teja Recent Behavior: సినీ ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ని ఆదర్శంగా తీసుకొని, ఆయనలాగే పెద్ద హీరో అవ్వాలని కలలు ఎంతో మంది వచ్చారు. కానీ కేవలం కొంతమంది మాత్రమే బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా సక్సెస్ అయ్యారు. వారిలో మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Ravi Teja) ఒకరు. ఆయన స్టార్ హీరో గా ఎదిగిన తీరు ప్రతీ ఒక్కరికి ఆదర్శం. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ గా, క్యారక్టర్ ఆర్టిస్టు గా ఎన్నో సినిమాల్లో నటించి, తర్వాత హీరో గా మారి హిట్ల మీద హిట్లు కొడుతూ స్టార్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటుడు ఆయన. అందుకే రవితేజ అంటే ఇండస్ట్రీ లో అందరికీ ఎంతో ప్రత్యేకమైన గౌరవం. కానీ ఈమధ్య కాలం లో రవితేజ చేస్తున్న సినిమాలు ఆయన అభిమానులకే చిరాకు కలిగించేలా ఉన్నాయి.

Also Read: ఎన్టీఆర్ వర్సెస్ నాగార్జున..ఈసారైనా ఎన్టీఆర్ పై చెయ్యి సాధిస్తాడా?

అసభ్యకరమైన డ్యాన్స్ లు హీరోయిన్ తో కలిసి వెయ్యడం, కూతురు వయస్సు ఉన్న హీరోయిన్ తో రొమాన్స్ చేయడం వంటివి రవితేజ స్థాయిని దిగజార్చే లాగా ఉన్నాయని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ అంటున్నారు. ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం లోని ఒక పాటలో రవితేజ హీరోయిన్ బ్యాక్ పాకెట్ లో చెయ్యి పెట్టి డ్యాన్స్ వేసే స్టెప్ తీవ్రమైన విమర్శలకు గురి అయ్యేలా చేసింది. ఈ పాటకు కోరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్ కూడా చాలా వ్యతిరేకతను ఎదురుకోవాల్సి వచ్చింది. పోనీ అక్కడితో వదిలేశారా అంటే లేదు. ప్రస్తుతం ఆయన ‘మాస్ జాతర’ అనే చిత్రం లో నటిస్తున్నాడు. శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ‘ధమాకా’ తర్వాత ఆమె రవితేజ తో కలిసి చేస్తున్న రెండవ చిత్రమిది. ఇప్పటికే ఒక పాటని విడుదల చేశారు దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ రీసెంట్ గా విడుదల చేసిన పాట మాత్రం తీవ్రమైన విమర్శలను ఎదురుకుంటుంది.

Also Read:  తండ్రి రాసిన మహేష్ కథను మరో రైటర్ తో మార్పిస్తున్న రాజమౌళి..?

ముఖ్యంగా అందులోని లిరిక్స్ చూస్తే అసలు ఏంటిది?, ఎందుకు ఇలా జనాలను హింసిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసాడు. రవితేజ చేత, శ్రీలీల చేత ఆయన మంచి స్టెప్పులే వేయించాడు. కానీ ఆ లిరిక్స్ కి చెవులు మూసుకోవాలని అనిపిస్తుంది. బుద్ధి లేదు, జ్ఞానం లేదు, లుంగీ లేదు అంటూ నోటికి వచ్చిన పదాలు రాసుకుంటూ పోయాడు రచయితా. నిజంగా ఈ పాటని రాసినోడికి సిగ్గు లేదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి రవితేజ ఇలాంటి లిరిక్స్ పెడుతున్నప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. అంటే డైరెక్టర్ ఏది చెప్తే అది గుడ్డిగా చేసుకుంటూ పోవడమేనా?, పెద్ద హీరో అన్న తర్వాత ఇలాంటివి పెట్టకు అని దర్శక నిర్మాతలకు చెప్పే స్వేచ్ఛ ఉంటుంది. రవితేజ ఎందుకని ఆపడం లేదు. ఎంతోకష్టపడి ఇండస్ట్రీ లో నేడు స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు రవితేజ. కెరీర్ చివర్లో ఇలాంటి చిల్లర పాటలు పెట్టుకొని స్థాయిని తగ్గించుకోవద్దు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Comment