- ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ్‌లో దారుణం..
- 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన మామ..
- చిన్నారి మృతదేహాన్ని పొరుగువారి కారు డిక్కీలో పడేసిన వైనం..
- నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు..
- నిందితుడికి కఠినమైన శిక్ష పడేలా చూస్తాం: ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి

Crime News: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ్‌లో దారుణం చోటు చేసుకుంది. 6 ఏళ్ల బాలికపై మామ అత్యాచారం చేసి హత్య చేశాడు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని పొరిగింటి వారి కారు డిక్కీలో దాచి పెట్టాడు. అయితే, వివరాల్లోకి వెళితే, నవరాత్రి ఉత్సవాల్లో అనావాయితీగా వస్తున్న కన్యా భోజ్‌లో పాల్గొనడానికి ఆ చిన్నారి తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. కానీ, చిన్నారి అమ్మమ్మ, మరో బంధువుతో కలిసి గుడికి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై సోమేష్ యాదవ్ అనే నిందితుడు లైంగిక దాడి చేసి హత్య చేశాడు.
Read Also: Dilsukhnagar Bomb Blast: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
ఇక, చిన్నారి ఇంట్లో కనిపించకపోవడంతో చుట్టుపక్కల మొత్తం గాలించిన ఆ బాలిక అమ్మమ్మ.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారణ చేయగా.. అసలు నిందితుడు ఆ చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అలాగే, బాలిక మృతదేహాన్ని ఇంటి పక్కన ఉండే వారి కారులో దాచి పెట్టినట్లు తెలిపారు. కాగా, ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ చిన్నారి శరీరంపై గాయాల గుర్తులతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వైద్యులు నిర్ధారించారు.
Read Also: Hardik Pandya: బయట వ్యక్తులకు ఏమీ తెలియదు.. తిలక్ ‘రిటైర్డ్ ఔట్’పై హార్దిక్ ఫైర్!
అయితే, నిందితుడు నేరం అంగీకరించాడని దుర్గ్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ సుఖ్‌నందన్ రాథోడ్ అన్నారు. అతడిపై అత్యాచారం, హత్య, కిడ్నాప్, ఇతర అభియోగాల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. దీనిపై నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తు పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఇక, ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి స్పందించారు. ఈ సంఘటన “అమానవీయమైనది” అన్నారు. దీని వెనుక ఉన్నవారికి కఠినమైన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి సమాజంలో స్థానం లేదని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. మరణించిన చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలి, బాలిక కుటుంబానికి ధైర్యాన్ని అందించాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అని సీఎం విష్ణు దేవ్ సాయి కోరారు.