6వ టౌన్ పోలీస్ స్టేషను పర్యవేక్షించిన పోలీస్ కమీషనర్ –

Written by RAJU

Published on:

6వ టౌన్ పోలీస్ స్టేషను పర్యవేక్షించిన పోలీస్ కమీషనర్ –నవతెలంగాణ-కంఠేశ్వర్ : నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య, ఐ.పి.యస్. 6వ టౌన్ పోలీస్ స్టేషన్ సోమవారం పర్యవేక్షించారు. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ సాయి చైతన్య పోలీస్ స్టేషన్ మొత్తం కలియతిరిగి పోలీస్ స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రిసిప్షన్ సెంటర్ పనితీరును , కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకు న్నారు.  5S విధానం అమలు చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకొని మొత్తం చూసారు.వాహనాల పార్కింగ్ చూసారు.రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. ప్రధానంగా ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనాదారులకు జరుగుతున్నందున, తప్పనిసరి హెల్మేట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు.గంజాయి నిర్మూలనకు అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగిందని, ఎవరయిన గంజాయికి బానిస అవుతే వారికి కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు , దాని నిర్మూలనకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. సైబర్ మోసగాండ్ల నుండి ప్రజలు మోసపోకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారుగెమింగ్ అప్ ల పట్ల ప్రజలు మోసపోకుండా ఎప్పటికప్పుడు వారికీ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిoచాలని అన్నారు.సిబ్బoది సాధక బాధలు ప్రతీ ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ రూరల్ సిఐ సురేష్ ఆరవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకట్రావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights