Virat Kohli and Rohit Sharma: టీం ఇండియా అభిమానులకు మరోసారి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బ్యాటింగ్ చూసే అవకాశం లభించబోతోంది. 7 నెలల విరామం తర్వాత, టీం ఇండియాకు చెందిన ఇద్దరు సూపర్ స్టార్ బ్యాటర్లు అంతర్జాతీయ క్రికెట్ లోకి తిరిగి వస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ కోసం భారత జట్టులో విరాట్, రోహిత్ లు చోటు దక్కించుకున్నారు. ఇది 2027 ప్రపంచ కప్ లో ఈ ఇద్దరు బ్యాటర్లు ఆడటం చూడవచ్చా అనే ప్రశ్నను లేవనెత్తింది? ఈ సిరీస్ తర్వాత విరాట్, రోహిత్ రిటైర్ అవుతారా? అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, వీరిద్దరూ ప్రపంచ కప్ లో ఆడాలనుకుంటున్నారా? చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ దీనికి సంబంధించి షాకింగ్ న్యూస్ వెల్లడించాడు.
Virat vs Rohit : భారత క్రికెట్ జట్టు అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడనుంది. ఈ పర్యటన యంగ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో జరగనుంది. అయితే, ఈ సిరీస్‌లో జట్టుకు అత్యంత కీలకమైన అనుభవం, పటిష్టమైన ప్రదర్శన అందించగల ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ దిగ్గజాల ప్రదర్శనపై అందరి దృష్టి ఉంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాపై వన్డేల్లో వీరికి అద్భుతమైన రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాపై కోహ్లీ, రోహిత్ వన్డే గణాంకాలు ఎలా ఉన్నాయో ఈ వార్తలో చూద్దాం.
బలమైన ఆస్ట్రేలియా జట్టుపై విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ఓవరాల్ వన్డే గణాంకాలను పరిశీలిస్తే ఇద్దరి ప్రదర్శన దాదాపు సమానంగా ఉన్నట్లు తెలుస్తోంది. కోహ్లీ రోహిత్ కంటే కొంచెం ఎక్కువ మ్యాచ్‌లు ఆడినప్పటికీ యావరేజ్ విషయంలో రోహిత్ స్వల్ప ఆధిక్యాన్ని కనబరిచాడు. ఆస్ట్రేలియాపై ఇప్పటి వరకు 50 వన్డే మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ, 54.46 సగటుతో మొత్తం 2451 పరుగులు సాధించాడు. ఇందులో 8 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు, రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై 46 వన్డే మ్యాచ్‌ల్లో 57.30 అనే అద్భుతమైన సగటుతో 2407 పరుగులు చేశాడు. కోహ్లీతో సమానంగా 8 సెంచరీలు చేసిన రోహిత్ 9 హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు. తక్కువ మ్యాచ్‌లు ఆడినప్పటికీ, రోహిత్ మెరుగైన సగటును కలిగి ఉన్నాడు.
ఆస్ట్రేలియాలో పరిస్థితులు భారత్‌కు భిన్నంగా, చాలా కఠినంగా ఉంటాయి. అయినా కూడా ఈ ఇద్దరు దిగ్గజాలు ఆస్ట్రేలియా గడ్డపై కూడా తమ కెపాసిటీ నిరూపించుకున్నారు. ఇక్కడ వారి ప్రదర్శన దాదాపు సమానంగా ఉంది. ఆస్ట్రేలియా గడ్డపై 30 వన్డే మ్యాచ్‌లు ఆడిన రోహిత్, 53.12 సగటుతో 1328 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో 29 వన్డే మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ, 51.03 సగటుతో 1327 పరుగులు చేశాడు. ఇందులో కూడా 5 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ఆడిన మ్యాచ్‌లు, చేసిన పరుగులు, సెంచరీల సంఖ్య దాదాపు సమానంగా ఉన్నప్పటికీ, స్వల్ప సగటు తేడాతో రోహిత్ ఇక్కడ కూడా ముందంజలో ఉన్నాడు.
ఆస్ట్రేలియాపై ఈ ఇద్దరు ఆటగాళ్ల అత్యధిక వ్యక్తిగత స్కోర్‌లను పరిశీలిస్తే, రోహిత్ శర్మ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాడు. కీలకమైన మ్యాచ్‌లలో భారీ స్కోర్లు చేయగల రోహిత్ కెపాసిటీని ఇది తెలియజేస్తుంది. ఆస్ట్రేలియాపై కోహ్లీ అత్యధిక స్కోరు 123 పరుగులు. 2019లో జరిగిన ఈ ఇన్నింగ్స్‌లో 95 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. రోహిత్ శర్మ 2013లో ఆస్ట్రేలియాపై 158 బంతుల్లో 12 ఫోర్లు, 16 సిక్సర్లతో 209 పరుగుల సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. వన్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై డబుల్ సెంచరీ సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ మాత్రమే కావడం విశేషం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..