Site icon Desha Disha

Virat Kohli : Virat Kohli : ఆస్ట్రేలియా చేరుకోగానే విరాట్ కోహ్లీ సంచలన ట్వీట్.. గంభీర్ వ్యాఖ్యలే కారణమా?.. గంభీర్ వ్యాఖ్యలే కారణమా? – Telugu News | Virat Kohlis Cryptic X Post Goes Viral Amid Speculation Over 2027 World Cup Future

Virat Kohli : Virat Kohli : ఆస్ట్రేలియా చేరుకోగానే విరాట్ కోహ్లీ సంచలన ట్వీట్.. గంభీర్ వ్యాఖ్యలే కారణమా?.. గంభీర్ వ్యాఖ్యలే కారణమా? – Telugu News | Virat Kohlis Cryptic X Post Goes Viral Amid Speculation Over 2027 World Cup Future

Virat Kohli Instagram Earnings: క్రీడా ప్రపంచంలోని ప్రధాన వేదికలలో విరాట్ కోహ్లీకి అత్యధిక సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోహ్లీకి ఉన్న ప్రజాదరణ ప్రపంచ స్టార్ హోదాను పటిష్టం చేస్తుంది. అయితే, భారత మాజీ కెప్టెన్ ఒకే ఒక వాణిజ్య ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఎంత సంపాదిస్తాడో తెలిస్తే కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే..

Virat Kohli : భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటనకు చేరుకున్న కొన్ని గంటల్లోనే చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో కోహ్లీ చేసిన ఈ మెసేజ్ తన వన్డే భవిష్యత్తుపై తీవ్ర చర్చకు దారి తీసింది. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా, కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానులలో మరింత ఆసక్తిని పెంచాయి. ఇంతకీ కోహ్లీ Xలో ఏం పోస్ట్ చేశారు? హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దీనిపై ఎలా స్పందించారు? వంటి వివరాలు తెలుసుకుందాం.

భారత సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అక్టోబర్ 16న ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో అడుగుపెట్టిన కొద్దిసేపటికే తన X అకౌంట్‌లో ఒక సీక్రెట్ మెసేజ్ పోస్ట్ చేశారు. సాధారణంగా వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి ఇష్టపడని కోహ్లీ చేసిన ఈ పోస్ట్ ఆయన వన్డే భవిష్యత్తుపై ఊహాగానాలకు దారి తీసింది. 2027 ప్రపంచకప్‌లో ఆడతారా లేదా అనే ప్రశ్నలు ఎదురవుతున్న నేపథ్యంలో కోహ్లీ “నువ్వు వదిలేయాలని నిర్ణయించుకున్నప్పుడే, నువ్వు నిజంగా ఓడిపోతావు” అంటూ పోస్ట్ చేశారు.

కోహ్లీ చేసిన ఈ ట్వీట్ వెంటనే వైరల్‌గా మారింది. ఈ మాటల వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటని అభిమానులు, నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇది తనపై విమర్శలు చేసేవారికి, రిటైర్మెంట్ గురించి మాట్లాడేవారికి కోహ్లీ ఇచ్చిన సమాధానమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియాతో అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌తో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వస్తున్నారు. వీరిద్దరి రీఎంట్రీ పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారి తీశాయి.

వెస్టిండీస్‌తో సిరీస్ ముగిసిన తర్వాత గంభీర్ మాట్లాడుతూ.. “వారు (రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ) క్వాలిటీ ప్లేయర్లు. వారి అనుభవం చాలా విలువైనది. 2027 ప్రపంచకప్‌కు ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉన్నందున, ప్రజెంట్ పరిస్థితుల మీద దృష్టి పెట్టడం ముఖ్యం. కోహ్లీ, రోహిత్ అద్భుతమైన ఆటగాళ్లు, వారి రాక జట్టుకు పెద్ద బూస్ట్ అవుతుంది. ఆస్ట్రేలియా పర్యటన విజయవంతం కావాలని కోరుకుంటున్నా, ముఖ్యంగా ఆస్ట్రేలియాలో జట్టు అద్భుతమైన ప్రదర్శన చేయాలి” అని అన్నారు.

గంభీర్ వ్యాఖ్యల తర్వాత ఆస్ట్రేలియా సిరీస్‌లో రోహిత్, కోహ్లీ పేలవంగా ఆడితే, వారిని వన్డే జట్టు నుంచి తప్పిస్తారేమో అనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి ప్రతిగానే కోహ్లీ పోరాటం చేయకుండా తగ్గేది లేదంటూ ఈ పోస్ట్ చేశారని అభిమానులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటన సీనియర్ క్రికెటర్ల కెరీర్‌ను ప్రభావితం చేసిన చరిత్ర ఉంది. గతంలో రోహిత్, కోహ్లీ ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడటానికి వచ్చినప్పుడు, ఆ పర్యటన తర్వాతే ఇద్దరూ టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు.

చివరిసారిగా కోహ్లీ భారత జట్టు కోసం ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. ఆ టోర్నమెంట్‌లో కఠినమైన పిచ్‌లపై కూడా కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును అన్ని గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లలో విజయతీరాలకు చేర్చాడు. 2025లో ఆస్ట్రేలియా టూర్ తర్వాత కోహ్లీ అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడమే కాకుండా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున తన మొదటి ఐపీఎల్ టైటిల్‌ను కూడా గెలుచుకోవడం విశేషం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Exit mobile version