Vijayawada: ఉదయాన్నే జిమ్‌లో చాటుమాటు యవ్వారం.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితారయ్యింది.. – Telugu News | Illegal Steroids Racket Busted: Vijayawada Gym Raided, Youth Suppliers Caught

అదో జిమ్.. చాలామంది ఉదయాన్నే అక్కడకు చేరుకుని వ్యాయామాలు చేస్తున్నారు.. ఈ క్రమంలోనే.. పోలీసులు ఎంట్రీ ఇచ్చి తనిఖీలు చేయడం మొదలు పెట్టారు.. దీంతో అక్కడ ఏం జరుగుతోందనన్న టెన్షన్ మొదలైంది.. కట్ చేస్తే.. భారీగా స్టెరాయిడ్స్‌ లభ్యమయ్యాయి.. ఈ షాకింగ్ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.. జిమ్ లో పోలీసులు పెద్ద ఎత్తున స్టెరాయిడ్స్ ను స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. విజయవాడలోని ఎనీటైమ్‌ ఫిట్నెస్ సెంటర్‌లో రసూల్ అనే యువకుడు జిమ్‌కి వచ్చే యువతకు స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోని పలు జిమ్‌లకు కూడా రసూల్‌ స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. సమీర్ అనే హెల్త్ సప్లిమెంట్స్ అమ్మే సునీల్ వ్యక్తితో కలిసి స్టెరాయిడ్స్ అమ్ముతున్నట్లు తేలింది. దీంతో ఈగల్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎనీటైమ్‌ ఫిట్నెస్ సెంటర్‌లో సంయుక్తంగా దాడులు చేశారు.. ఈ తనిఖీల్లో భారీగా స్టెరాయిడ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సమీర్, సునీల్ జిమ్‌లల్లో యువకులకు స్టెరాయిడ్స్ సరఫరా చేస్తున్నట్లు పక్కా సమాచారంతో ఈగల్, టాస్క్‌ఫోర్స్‌ బృందాలు సంయుక్తంగా ఈ దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న సమీర్ స్నేహితుడు సునీల్ కోసం పటమట పోలీసులు గాలిస్తున్నారు. కాగా.. విజయవాడలో భారీగా స్టెరాయిడ్స్ పట్టుకోవడం కలకలం రేపింది.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment