Toxic People: ఈ రెండు లక్షణాలు ఉన్న వ్యక్తికి దూరంగా ఉండండి.. లేకుంటే ముంచేస్తారు..

Toxic People: మనం కొన్ని పనులు చేయాలని అనుకుంటాం.. కానీ మనం చేసే పనుల కన్నా పక్క వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. కొంతమంది అయితే తమ పనులు మానుకొని పక్కనే ఉన్నవాళ్లు చేసే పనిని కూడా చెడగొడుతూ ఉంటారు. అందువల్లే చాలామంది వాళ్లు సక్సెస్ కాక.. మిగతా వాళ్ళని కూడా సక్సెస్ కానివ్వకుండా ఉంటారు. అయితే ఇలాంటి వారికి రెండు ప్రధాన లక్షణాలు ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే ప్రతి విషయం తనకే తెలుసు అని అహం ఉంటుంది. ఇంకొకటి ఎవరు తనకు సూచనలు ఇవ్వద్దు.. అని అనుకుంటూ ఉంటారు. ఈ రెండు విషయాలపై ఒక నీతి కథ ద్వారా చూద్దాం..

ఒక వ్యక్తి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్దామని రైల్వే స్టేషన్ కు వచ్చాడు. అయితే ఆ వ్యక్తికి రెండు రకాల లక్షణాలు ఉంటాయి. ఒకటి తాను ఎవరి మాట వినడు. అంతేకాకుండా ఇతరులు ఏమనుకుంటున్నారో ఎప్పటికీ గమనిస్తూ ఉంటాడు. తన గురించి ఇతరులు ఒక చిన్నమాటన్నా తట్టుకోలేక పోతాడు. అయితే రైల్వే ప్లాట్ ఫారం పైకి రైలు వచ్చి నిలిచింది. ఆ రైలు ఎక్కకుండా కాసేపు ఆగిన తర్వాత ఎక్కుదామని ఒకచోట కూర్చుంటాడు. ఇదే క్రమంలో అక్కడ ఒక వెయిట్ మిషన్ కనిపిస్తుంది. ఈ మిషన్పై ఏమని రాసి ఉందంటే.. నీ గురించి నేను పూర్తిగా చెబుతాను.. అని ఉంటుంది. నా గురించే చెప్పేంత ధైర్యం నీకు ఉంటుందా..? అని ఆ వ్యక్తిలో అహం పెరిగిపోతుంది. దీంతో ఆ మిషన్ సంగతేంటి తెలుసుకోవాలని దగ్గరికి వెళ్తాడు. అందులో ఒక కాయిన్ వేయగానే ఒక చిట్టి బయటకు వస్తుంది. అందులో ఆ వ్యక్తి గురించి పూర్తి వివరాలు ఉంటాయి.

ఆ మిషన్ పై నమ్మకం లేక అతడు ఈసారి ముఖానికి మాస్క్ పెట్టుకొని.. నెత్తికి హెడ్ క్యాప్ ధరించి మరోసారి వెయిట్ మిషన్ పై నిలబడతాడు. దీంతో మరోసారి ఆ మిషన్ నిజం చెబుతోంది. ఈసారి నువ్వు మాస్క్ పెట్టుకున్నావ్.. తలకు క్యాప్ కూడా ధరించావు.. అని చెబుతోంది.. అంతేకాకుండా నువ్వు వెళ్లాలనుకున్న ట్రైన్ వెళ్లిపోయింది.. అని కూడా చెబుతుంది. అలా ఆ వ్యక్తి వెనక్కి తిరిగి చూసేసరికి ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది. దీంతో వ్యక్తి షాకుకు గురవుతాడు.

ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే మన గురించి మనం ఆలోచించడం కన్నా ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవడం చాలామందికి అలవాటుగా మారింది. ఇలా చేయడం వల్ల వారు జీవితంలో ఫెయిల్ కావడమే కాకుండా.. పక్కన ఉన్న వారిని కూడా ఫెయిల్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇలాంటి వ్యక్తులు ఎక్కడైనా ఎదురైనా కూడా.. వారికి దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే ఇలాంటి వారితో స్నేహం చేసినా కూడా జీవితం నాశనం అయ్యే అవకాశం ఉంటుంది.

[

Leave a Comment