Preethi Reddy Dance: వెనుకటి కాలంలో రాజకీయ నాయకుల వారసులు అంతగా కనిపించేవారు కాదు. ఒక నాయకుడు తన రాజకీయ జీవితాన్ని పూర్తిగా ముగిస్తే వారసులు తెర పైకి వచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారి పోయింది. రాజకీయ నాయకులు రాజకీయాన్ని ఒక వారసత్వ వ్యవస్థగా మార్చుతున్నారు. దీంతో నాయకులు ఉండగానే.. వారి వారసులు తెరపైకి వస్తున్నారు. రాజకీయాలను చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో కుటుంబ పార్టీలు అధికంగా ఉండడం వల్ల రాజకీయం అనేది వారసత్వంగా మారిపోయింది. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలో కూడా కుటుంబ వ్యవస్థ కొనసాగుతూ విశేషం.
తెలుగు నాట కుటుంబ పార్టీలు అధికంగా ఉన్నాయని చెప్పుకున్నాం కదా.. ఆ కుటుంబ పార్టీలలో తామరతంపరగా నాయకులు వస్తూనే ఉన్నారు. కొంతమంది రాజకీయాలలో ఉండగానే.. మిగతా వారు తమ బెర్త్ కన్ఫాం చేసుకుంటున్నారు. అంతేకాదు రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ పని మాజీ మంత్రి మల్లా రెడ్డి కోడలు ప్రీతి రెడ్డి చేస్తున్నారు.
ప్రీతి రెడ్డి ఉన్నత విద్యా వంతురాలు. మల్లా రెడ్డి ఏర్పాటుచేసిన విద్యాసంస్థలను ఆమె పర్యవేక్షిస్తున్నారు.. విద్యా సంస్థలను పర్య వేక్షిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన అన్ని విషయాలను అందులో పంచుకుంటారు. తాజాగా ప్రీతి రెడ్డి కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో సెన్శేషన్ క్రియేట్ చేస్తోంది. ఆ వీడియోలో ప్రీతి రెడ్డి తన స్థాయిని మర్చి పోయారు. సరదాగా నృత్యాలు చేశారు. మల్లా రెడ్డి విద్యాసంస్థల విద్యార్థులతో ఉత్సాహంగా డ్యాన్సులు వేశారు. ఆమె డాన్సులు వేస్తున్న దృశ్యాలను మల్లా రెడ్డి ఆసక్తిగా గమనించారు. తన కోడలు తనను మించిపోయిందని ముసి ముసి నవ్వులు నవ్వారు.
ప్రీతి రెడ్డి కేవలం విద్యాసంస్థల పర్యవేక్షకురాలు మాత్రమే కాదు… సామాజిక మాధ్యమాలలో చురుకుగా ఉంటారు. అంతకుమించి రాజకీయాలలో కూడా ప్రవేశించేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఆ మధ్య ఆమె భారతీయ జనతా పార్టీ లో చేరుతారని ప్రచారం జరిగింది. అంతే కాదు బోనాల పండగ సందర్భంగా ఆమె పేరుతో ఫ్లెక్సీ లు కూడా ఏర్పాటయ్యాయి..ఓ కార్య కర్త ఇంటికి ఆమె భోజనానికి వెళ్ళారు. ఆ సమయంలో బండి సంజయ్ కూడా అక్కడికి వచ్చారని ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత ఆమె బీజేపీ లో చేరతారని ప్రచారం జరిగినప్పటికీ..అది ప్రచారం మాదిరిగానే మిగిలి పోయింది.