Pradeep Ranganathan Viral Video: స్టేజిపై హీరోయిన్ జుట్టు పట్టుకొని లాక్కెళ్లిన హీరో ప్రదీప్ రంగనాథన్..వీడియో వైరల్!

Pradeep Ranganathan Viral Video: తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) నటించిన లేటెస్ట్ చిత్రం ‘డ్యూడ్'(Dude Movie) రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన తర్వాత ప్రదీప్ నుండి వస్తున్న సినిమా కావడంతో మొదటి నుండే ఈ చిత్రం పై ఆడియన్స్ లో ఆసక్తి ఉంది. దానికి తోడు ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కూడా క్లిక్ అవ్వడం తో అంచనాలు భారీగా పెరిగాయి. హీరో, హీరోయిన్లు కూడా రెండు భాషల్లో ప్రొమోషన్స్ డెడికేషన్ తో ఇరగ కుమ్మేస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్వ్యూస్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే నిన్న హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో హీరో ప్రదీప్, హీరోయిన్ మామితా బైజు మధ్య జరిగిన ఒక క్యూట్ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు చర్చానీయాంసంగా మారింది.

ట్రైలర్ లోని ఒక షాట్ లో, హీరో తో హీరోయిన్ రకరకాలా ఎక్స్ ప్రెషన్స్ పెట్టి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేస్తుంది గుర్తుందా ?, ఆ సన్నివేశాన్ని రీ క్రియేట్ చేశారు. ప్రదీప్ ముందుగా మమిత బుగ్గలు గట్టిగా పట్టుకుంటాడు. ఆ తర్వాత ఆమె జుట్టు పట్టుకొని లాక్కెళ్తాడు. అప్పుడు మమిత ఏంటి ఇవన్నీ క్యూట్ గా ఉన్నాయని అనుకుంటున్నావా?, అసలు లేదు అని అంటుంది. ఇది ట్రైలర్ చూడని వాళ్లకు హీరో తన సినిమా హీరోయిన్ పట్ల అసభ్యంగా వ్యవహరించాడు అని అనిపిస్తుంది. కానీ ట్రైలర్ ని చూసిన వాల్లకు మాత్రం కేవలం రీ క్రియేట్ చేసారు అనేది అర్థం అవుతుంది. దీనిని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ షేర్ చేస్తూ, ఇదేమి ప్రవర్తన అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఆసక్తి కరమైన కంటెంట్ ని క్రియేట్ చేస్తూ,హీరో హీరోయిన్లు సినిమా పై బజ్ ని పెంచడంలో సక్సెస్ అయ్యారు.

మొదటి రెండు సినిమాలతో వరుసగా వంద కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన ప్రదీప్ రంగనాథన్, ‘డ్యూడ్’ తో ఏకంగా 200 కోట్ల గ్రాస్ ని టార్గెట్ చేసాడు. టాక్ వస్తే కచ్చితంగా ఈ సినిమా ఆ మార్కుని అందుకుంటుంది. ట్రైలర్ ని చూస్తుంటే ఈసారి కూడా ప్రదీప్ చాలా గట్టిగానే కొట్టేలా అనిపిస్తున్నాడు. యూత్ ఆడియన్స్ ఈ ట్రైలర్ లోని కొన్ని క్లిప్స్ ని సోషల్ మీడియా లో షేర్ చేసి రీ క్రియేట్ చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా ఈ ట్రైలర్ లోని క్లిప్స్ కనిపిస్తున్నాయి. అలా ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ఏ మేరకు ఓపెనింగ్స్ రాబడుతుందో చూడాలి. అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని చోట్ల యావరేజ్ నుండి ఎబోవ్ యావరేజ్ రేంజ్ లో ఉన్నాయి.

Leave a Comment