Pradeep Ranganathan Viral Speech: యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్నటువంటి ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) లేటెస్ట్ చిత్రం ‘డ్యూడ్'(Dude Movie) రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు,తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యేలా చేసింది. ఎలాంటి అంశాలను ముట్టుకుంటే యూత్ ఆడియన్స్ లో క్రేజ్ వస్తుందో, వాటిని గురి చూసి పట్టుకుంటున్నాడు హీరో ప్రదీప్. చూస్తుంటే ఈ సినిమా తో ఆయన నేరుగా తమిళ స్టార్ హీరోల జాబితాలోకి చేరిపోతాడు అని అనిపిస్తుంది. అంతలా ఇతను యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోతున్నాడు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కి ఇలా కనెక్ట్ అయ్యేవారు, ఆ తర్వాత విజయ్ దేవరకొండ, ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ కూడా ఈ జాబితాలోకి చేరిపోయాడు. నిన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసారు.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హీరో, హీరోయిన్లతో పాటు మూవీ యూనిట్ మొత్తం పాల్గొన్నారు. రెగ్యులర్ గా ప్రసంగిస్తే ఏముంటుంది?, కాస్త డిఫరెంట్ గా ప్రయత్నం చెయ్యాలి అనే ఉద్దేశ్యంతో ప్రదీప్ చేసిన ఒక యాక్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ప్రదీప్ కి తెలుగు పెద్దగా రాదు కాబట్టి, ఆయన తనతో పాటు ఒక ట్రాన్స్ లేటర్ ని తెచ్చుకున్నాడు. అతను తన అసిస్టెంట్ డైరెక్టర్ అట, తెలుగు వాడట. వీళ్లిద్దరు కలిసి ‘నువ్వు నేను’ సినిమాలోని MS నారాయణ, ధర్మవరపు సుబ్రమణ్యం కామెడీ ని రీ క్రియేట్ చేశారు. అందులో MS నారాయణ ఇంగ్లీష్ లో ప్రసంగం ఇస్తే, దానిని అనువదిస్తూ ధర్మవరపు సుబ్రహ్మణ్యం చేసే ఎవర్ గ్రీన్ కామెడీ ని అంత తేలికగా ఎవరైనా మర్చిపోగలరా?. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అదే ప్రయత్నం చేశారు.
ఇది ఒక రేంజ్ లో పేలింది. 9 నిమిషాల నిడివి ఉన్న ప్రసంగం ఆద్యంతం కడుపుబ్బా నవ్వించింది. మధ్యలో ప్రదీప్ తన అసిస్టెంట్ డైరెక్టర్ పై కోపం తెచ్చుకొని కొట్టబోవడం వంటివి చాలా ఫన్నీ గా అనిపించాయి. సోషల్ మీడియా ని ఊపేస్తున్న ఈ వీడియో ని క్రింద అందిస్తున్నాము, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇదే ఈవెంట్ లో హీరోయిన్ తో ప్రదీప్ కలిసి ట్రైలర్ లోని కొన్ని షాట్స్ ని రీ క్రియేట్ చేశారు. అవి సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ నే ఇంత ఫన్ మార్చారంటే, ఇక సినిమాలో ఏ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందో ఊహించుకోవచ్చు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ డ్యూడ్ ఆడియన్స్ ని ఎలా అలరించబోతున్నాడు అనేది.