PM Modi AP Visit: లోకేష్ ను చూసి అవాక్కైన మోడీ.. ఇది ఊహించలేదు

PM Modi AP Visit: ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) పర్యటనలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ పర్యటన నిమిత్తం ఈరోజు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి కర్నూలు చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆయనకు ఎయిర్పోర్ట్ లో ఘనస్వాగతం లభించింది. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు స్వాగతం పలికారు. కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి శ్రీశైలం మల్లన్న ఆలయానికి ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆయనతో పాటు చంద్రబాబు, పవన్ సైతం వెళ్లారు. అయితే విమానాశ్రయంలో లోకేష్ ను చూసి ప్రధాని నరేంద్ర మోడీ ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

* ప్రధానితో మంచి సంబంధాలు..
ప్రధాని నరేంద్ర మోడీతో లోకేష్ కు ఇటీవల మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. నేరుగా ప్రధానితో సమావేశం అయ్యే అవకాశం ఒక రాష్ట్ర మంత్రిగా లోకేష్ కు దక్కింది. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు లోకేష్. ఆపై ప్రభుత్వంలో సైతం తనదైన పనితీరుతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఆరాటపడుతున్నారు. అందుకే కేంద్ర పెద్దలు సైతం లోకేష్ ను ప్రోత్సహిస్తున్నారు. కూటమిలో తెలుగుదేశం పార్టీ కీలకం కావడం.. లోకేష్ భావి నాయకుడు కావడంతో కేంద్ర పెద్దలు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మొన్న ఆ మధ్యన భార్య, కుమారుడితో కలిసి ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు లోకేష్. ప్రధాని తరచూ ఏపీ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో లోకేష్ కు ప్రాధాన్యం ఇస్తున్నారు.

* సన్నబడ్డావ్ అంటూ కామెంట్స్..
తాజాగా కర్నూలు పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీని ఎయిర్పోర్ట్లో నమస్కరిస్తూ స్వాగతం పలికారు నారా లోకేష్. ఒక్కసారిగా లోకేష్ ను చూసిన ప్రధాని మోదీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏంటి ఇంతలా సన్నబడ్డావ్ అంటూ ప్రశ్నించారు. ఇలానే సన్నబడితే మీ నాన్నలా అవుతావు అంటూ చంద్రబాబును చూపించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు పూసాయి. అనంతరం ప్రధాని మోదీ ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. స్వామి వారి దర్శనం అనంతరం చత్రపతి శివాజీ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం బ్రమరాంబ గెస్ట్ హౌస్ లో విశ్రాంతి తీసుకున్నారు. భోజనం అనంతరం కర్నూలు జీఎస్టీ సభకు వచ్చారు.

Leave a Comment