PM Modi AP Tour Schedule: ఏపీకి మోదీ.. రోజంతా ఏం చేయనున్నారంటే?

PM Modi AP Tour Schedule: ఏపీకి మోదీ.. రోజంతా ఏం చేయనున్నారంటే?

PM Modi AP Tour Schedule: ఏపీలో( Andhra Pradesh) ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్ది గంటల్లో ఏపీకి ప్రధాని రానున్నారు. రోజంతా కర్నూలు జిల్లాలో ఉండనున్నారు. ముందుగా శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. అనంతరం రూ.13,430 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం డ్రోన్ సిటీకి శంకుస్థాపన వంటి ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రధాని మోదీ. ప్రధాని పర్యటనకు సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లాలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని తో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం పాల్గొనున్నారు.

* షెడ్యూల్ ఇదే..
ప్ర ధాని మోదీ ఉదయం 9:50 గంటలకు ప్రత్యేక విమానంలో కర్నూలు విమానాశ్రయానికి( Kurnool airport ) చేరుకుంటారు. అక్కడి నుంచి హెలిక్యాప్టర్లు సున్నిపెంటకు చేరుతారు. రోడ్డు మార్గం గుండా శ్రీశైలం వెళ్తారు. ఉదయం 10: 55 గంటలకు శ్రీశైలం చేరుకొని 12:15 గంటల వరకు ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. పురావస్తు శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించనున్నారు. మధ్యాహ్నం 12 5 గంటలకు ప్రధాని బయలుదేరి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. 12:40 గంటలకు బ్రమరాంబ గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. అక్కడ విశ్రాంతి తీసుకున్న తర్వాత ఒకటి 40 గంటలకు సున్నిపెంట నుంచి కర్నూలుకు హెలిక్యాప్టర్లో వెళ్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు కర్నూలు పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. ప్రధానంగా విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ పరిశ్రమలతో పాటు మరిన్ని రంగాలకు సంబంధించిన 13 వేల కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు చేస్తారు.

* ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు..
ఇటీవల 250 కు పైగా వస్తువులపై కేంద్ర ప్రభుత్వం( central government) జీఎస్టీ ని తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జీఎస్టీ తగ్గింపు అనేది సూపర్ హిట్ గా మారింది. అందుకే ఈ సూపర్ హిట్ సభను, రోడ్డు షోను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. 12 మంది మంత్రుల బృందం కర్నూలులో మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ప్రధాని సభకు దాదాపు 3 లక్షల మంది వస్తారని అంచనా లు ఉన్నాయి. 7000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. 7500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Leave a Comment