PM Modi AP Tour: ప్రధాని మోదీ పర్యటన వేళ.. ఏపీకి గుడ్ న్యూస్!

PM Modi AP Tour: ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) ఏపీ పర్యటన వేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు కర్నూలు పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. శ్రీశైలం ఆలయ సందర్శనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. జీఎస్టీ సూపర్ హిట్ సభలో పాల్గొనున్నారు. ఆపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి రోడ్ షో నిర్వహించనున్నారు. ఇది ఏపీకి గేమ్ చేంజర్ గా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు. ఇంతలోనే రాష్ట్రానికి మరో శుభవార్త వచ్చింది. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ క్యారీడార్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

* రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన..
ఇటీవల రాష్ట్రం కేంద్రానికి ఒక కీలక ప్రతిపాదన చేసింది. అనంతపురం( Ananthapuram ) నుంచి నెల్లూరు జిల్లా రామయ్య పట్నం వరకు భారీ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని కేంద్రానికి కోరింది. దీంతో కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈ ప్రాజెక్టుకు గాను రూ.21,800 కోట్లు మంజూరు చేయడానికి అనుమతించింది. ఈ కొత్త గ్రీన్ ఎనర్జీ క్యారీడర్ లైన్లు పూర్తయితే.. రాయలసీమ ప్రాంతంలో సోలార్, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు సులభంగా తరలించేందుకు వీలవుతుంది. ఇది రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ పంపిణీ వ్యవస్థకు, పునరుత్పాదక ఇంధన వినియోగానికి ఎంతగానో దోహదపడనుంది.

* కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. ఈ ప్రాజెక్టు వ్యయంలో 30% గ్రాంట్ కింద నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం( central government) ముందుకు వచ్చింది. మిగిలిన 70 శాతం ఏపీ ట్రాన్స్కో భరించనుంది. డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు వస్తాయని భావిస్తున్నారు. 2028 నాటికి ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ క్యారీడర్ 3 కింద ఈ ప్రాజెక్టు చేపట్టాలని కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది. దీనికి మొత్తం 28 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం రూ.21,800 కోట్లతో ఈ ప్రాజెక్టును మంజూరు చేసింది. మొత్తానికైతే ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తున్న సమయంలో.. కేంద్రం గుడ్ న్యూస్ చెప్పడం విశేషం.

Leave a Comment