Pic of the Day: ప్రపంచ దేశాల్లో ప్రధాని మోదీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా చేశారు. దేశంలో కూడా బలమైన రాజకీయవేత్తగా మారారు. అయితే మూడోసారి ప్రధాని అయ్యేందుకు దోహదపడిన రాష్ట్రం ఏపీ. అందుకే ఏపీకి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా అండదండలు అందిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్నారు. అయితే ఈరోజు ప్రధాని ఏపీ పర్యటన నేపథ్యంలో.. ఆ ముగ్గురు ఒకే ఫ్రేమ్ లోకి వచ్చారు. సంప్రదాయ వస్త్రధారణతో అలరించారు. ప్రస్తుతం ఈ దృశ్యాలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇద్దరు నేతలతో శ్రీశైలం ఆలయానికి..
ఈరోజు ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు ప్రధాని మోదీ. అక్కడ నుంచి హెలిక్యాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. వెళుతూ వెళుతూ సీఎం చంద్రబాబు తో పాటు పవన్ కళ్యాణ్ ను తన వెంట తీసుకెళ్లారు. ప్రధానిగా శ్రీశైలం క్షేత్రం సందర్శనకు మోడీ రావడం ఇదే తొలిసారి. గతంలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. నరేంద్ర మోడీ నాలుగో ప్రధానమంత్రి. అయితే మోడీ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారీ ఏర్పాట్లు చేసింది. ఏపీకి వచ్చిన మోడీ చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. తన వెంట శ్రీశైలం క్షేత్రానికి తీసుకెళ్లారు. అయితే ముగ్గురు నేతలు సంప్రదాయ వస్త్రధారణలతో.. స్వామి వారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఈ ముగ్గురు నేతల సంప్రదాయ వస్త్రధారణ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జీఎస్టీ సూపర్ హిట్ సభలో..
అయితే శ్రీశైలం సందర్శన అనంతరం తిరిగి కర్నూలు చేరుకున్నారు ప్రధాని మోదీ. ఈ క్రమంలో ఈ ముగ్గురు నేతలు రోడ్ షో నిర్వహించారు. అనంతరం బహిరంగ సభకు చేరుకున్నారు. మరోవైపు మంత్రి లోకేష్ తో పాటు కేంద్ర మంత్రులు సైతం హాజరయ్యారు. దాదాపు 3 లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. ఆధ్యాంతం ప్రధాని నరేంద్ర మోడీ.. సీఎం చంద్రబాబు తో పాటు పవన్ కళ్యాణ్ కు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు.