Modi AP tour: ప్రధాని మోదీ( Prime Minister Narendra Modi) ఏపీలో పర్యటిస్తున్నారు. ఈరోజు ప్రత్యేక విమానంలో కర్నూలు చేరుకున్నారు. శ్రీశైలం మల్లన్న దర్శనం పూర్తి చేసుకున్నారు. జీఎస్టీ సూపర్ హిట్ సభలో పాల్గొన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి వస్తున్నవేళ ఒక రకమైన ప్రచారం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా వామపక్ష భావజాలాలు ఉన్న నేతలు పన్నులు పెంచింది.. తగ్గించింది మోడీ.. మరి ఆయనలో గొప్పతనం ఏంటి? అనే ప్రశ్నలు, నిలదీతలతో సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. దీనికి సంబరాలు చేసుకోవాలా? అనే ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. మోదీ వ్యతిరేక ప్రచారంతో సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి.
చారిత్రాత్మక నిర్ణయం..
కేంద్ర ప్రభుత్వం( central government) గత నెలలో 270 వస్తువులపై జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అందుకు సంబంధించిన వస్తువుల పైనే జీఎస్టీ తగ్గించారు. ఇది చారిత్రాత్మక నిర్ణయం కూడా. ఎందుకంటే అంతకుముందు పన్నుల విధానాన్ని జీఎస్టీ గొడుగు కిందకు తెచ్చింది ప్రధాని మోదీ. ఇప్పుడు నాలుగు రకాల స్లాబులు విధించి జీఎస్టీ తగ్గించింది కూడా ప్రధాని మోది. సమాజంతో పాటు దేశ చరిత్రపై అవగాహన ఉన్నవారు దీనిని ఆహ్వానించాలి. ప్రధాని మోదీ నిర్ణయాలను స్వాగతించాలి. కానీ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఈరోజు కర్నూలు పర్యటనకు ప్రధాని వచ్చిన నేపథ్యంలోనే సోషల్ మీడియాలో విపరీతమైన వ్యతిరేక పోస్టులు కనిపిస్తున్నాయి.
Also Read: ఆంధ్రజ్యోతి పంట పండింది పో.. ఏకంగా ప్రభుత్వమే..
ఉద్యోగులకు సైతం మినహాయింపు..
పన్నుల విధానం అనేది బ్రిటిష్ కాలం ( British time) నుండి నడుస్తూ వస్తోంది. చివరకు వృత్తి పన్నును కూడా విడిచిపెట్టలేదు. తక్కువ మొత్తంలో జీతం ఉన్న వారిని వదలలేదు. ప్రైవేటు ఉద్యోగుల నుంచి సైతం ముక్కు పిండి వసూలు చేశారు. అటువంటిది ఉద్యోగులకు సైతం పన్నుల మినహాయింపు ఇచ్చిన చరిత్ర ప్రధాని మోదీ ది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించవచ్చు కానీ.. ప్రజలకు ఉపయోగపడే ఈ జీఎస్టీ తగ్గింపును కూడా వ్యతిరేక ప్రచారం చేయడం మాత్రం కుట్రపూరితంగా వస్తుంది. అయితే జాతికి సంబంధించి, దేశానికి సంబంధించి ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలను స్వాగతించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుతం దేశంలో రాజకీయం కోణంలో ఆలోచించి.. భావ స్వేచ్ఛ పేరిట సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతున్నారు. ముమ్మాటికీ అది చాలా తప్పిదం.