కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం విద్యార్థుల కోసం ప్రత్యేక ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ రంగంలో కెరీర్‌ను కొనసాగించడానికి ఆసక్తి కలిగిన వారికి ఇదొక సువర్ణావకాశం. ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా మీడియా, సోషల్ మీడియాలో పని అనుభవం పొందడానికి అవకాశాన్ని అందించడమే కాకుండా.. నెలవారీ రూ.15 వేల వరకు స్టైఫండ్‌ను కూడా అందిస్తుంది.
ఇంటర్న్‌షిప్కు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
ఈ ఇంటర్న్‌షిప్ జల వనరులు, నదీ అభివృద్ధి, గంగా పునరుజ్జీవన విభాగం (DoWR, RD & GR) కింద అందిస్తున్నారు. ఈ కింది అర్హతలు కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు
ఇవి కూడా చదవండి
- మాస్ కమ్యూనికేషన్ లేదా జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
- ఈ సబ్జెక్టులలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా చదువుతున్నవారు కూడా అర్హులు.
- గుర్తింపు పొందిన కళాశాల/విశ్వవిద్యాలయం నుంచి MBA (మార్కెటింగ్) చదువుతున్నవారు.
- మాస్ కమ్యూనికేషన్ లేదా జర్నలిజానికి సంబంధించిన అధ్యయన రంగాన్ని కలిగి ఉన్న రీసెర్చ్ హోల్డర్లు.
ఇంటర్న్‌షిప్ ఎన్ని రోజులు ఉంటుందంటే?
జల్ శక్తి మంత్రిత్వ శాఖలో ఇంటర్న్‌షిప్ 6 నుంచి 9 నెలల వరకు ఉంటుంది. ఇంటర్న్‌షిప్ పూర్తయ్యేంత వరకు ప్రతి నెల రూ. 15,000 చొప్పున స్టైఫండ్‌ను అందిస్తుంది. ఈ ఇంటర్న్‌షిప్ న్యూఢిల్లీలో ఉంటుంది. ఇంటర్న్‌షిప్ పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. ఆసక్తి కలిగిన వారు నవంబర్ 24, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఇంటర్న్‌షిప్ ఎలా ఉంటుందంటే?
ఈ ఇంటర్న్‌షిప్కు ఎంపికైన అభ్యర్థులు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సోషల్ మీడియా నిర్వహణలను నిర్వహించడానికి, మీడియా సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనడానికి అవకాశం లభిస్తుంది. ఈ కార్యక్రమం డిజిటల్, సోషల్ మీడియా రంగంలో వృత్తిపరమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇది అభ్యర్ధుల కెరీర్‌కు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
ఆసక్తిగల అభ్యర్థులు మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 24, 2025. కాబట్టి ముగిపు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇటీవల, జల్ శక్తి మంత్రిత్వ శాఖలోని తాగునీరు, పారిశుద్ధ్య విభాగం గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరాను మెరుగుపరచడానికి ఒక కొత్త డిజిటల్ మాడ్యూల్‌ను ప్రారంభించింది. గ్రామీణ నీటి సరఫరా పథకాల (RPWSS) ఈ అప్‌గ్రేడ్ చేసిన మాడ్యూల్ గ్రామీణ నీటి పాలనను డిజిటలైజ్ చేయడంలో ఒక పెద్ద అడుగు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని అందిపుచ్చుకోవడనికి ఈరోజే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.