జ్యోతిషశాస్త్రంలో కుజుడు చాలా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాడు. కుజుడు అగ్నితత్వానికి అధిపతి. ఉగ్ర స్వభావం కలవాడు. అందుకనే కుజుడిని అంగారకుడు అని కూడా అంటారు. కుజుడు శక్తి, ధైర్యం, శౌర్యం, విశ్వాసం ,నాయకత్వానికి కారకంగా పరిగణిస్తారు. కుజుడు ఏదైనా రాశిలో సంచరింనప్పుడు.. ఆ ప్రభావం జీవితంలోని ప్రతి అంశంలోనూ, కెరీర్, సంపద, ఆరోగ్యం, సంబంధాలలోనూ కనిపిస్తుంది. ప్రస్తుతం కుజుడు కర్కాటకంలో సంచరిస్తున్నాడు. అయితే అది అక్టోబర్ 27, 2025న తన సొంత రాశి అయిన వృశ్చికంలోకి ప్రవేశించనున్నాడు. కుజుడు తన సొంత రాశిలో అడుగు పెట్టడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
