IND vs AUS: టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన కోసం పెర్త్ చేరుకుంది. ఇక్కడి నుంచే భారత జట్టు తన వైట్ బాల్ సిరీస్ (వన్డే, టీ20) ప్రయాణాన్ని ప్రారంభించనుంది. భారత జట్టు అక్టోబర్ 19న పర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో తొలి వన్డే ఆడనుంది. అయితే, ఆటగాళ్లు ఆస్ట్రేలియాకు చేరుకునే ముందు ఒక అనూహ్య సంఘటన జరిగింది. అదేమిటంటే భారత జట్టు ప్రయాణిస్తున్న విమానం లేటయ్యింది.
టీమిండియా నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా ఆస్ట్రేలియాలోని పెర్త్ చేరుకుంది. మీడియా నివేదికల ప్రకారం.. భారత జట్టు విమానం 4 గంటలు ఆలస్యంగా పెర్త్‌కు చేరింది. విమానం ఆలస్యం కావడంతో ఆటగాళ్ల ముఖాల్లో అలసట స్పష్టంగా కనిపించింది. భారత జట్టు అక్టోబర్ 16న తెల్లవారుజామున ఆస్ట్రేలియాకు చేరుకుంది. అయితే, ఈ ఆలస్యం కారణంగా కూడా టీమిండియా ప్రాక్టీస్ షెడ్యూల్‌లో మాత్రం ఎలాంటి మార్పు జరగలేదని సమాచారం.
శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమ్ ఇండియా తెల్లవారుజామున పర్త్ చేరుకున్నప్పటికీ, ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా అదే రోజు సాయంత్రం ప్రాక్టీస్ చేయనుంది. భారత జట్టు 2 గంటల పాటు ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంది. ఈ ప్రాక్టీస్ ఆస్ట్రేలియా సమయం ప్రకారం సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు కొనసాగుతుంది.
ఆస్ట్రేలియా పర్యటన పూర్తి షెడ్యూల్
టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. పూర్తి షెడ్యూల్ వివరాలు ఇక్కడ ఉన్నాయి:
మొదటి వన్డే: అక్టోబర్ 19, పెర్త్
రెండవ వన్డే: అక్టోబర్ 23, అడిలైడ్
మూడవ వన్డే: అక్టోబర్ 25, సిడ్నీ
టీ20 సిరీస్ షెడ్యూల్
వన్డే సిరీస్ తర్వాత, అక్టోబర్ 29 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది.
మొదటి టీ20: అక్టోబర్ 29, కాన్‌బెర్రా
రెండవ టీ20: అక్టోబర్ 31, మెల్‌బోర్న్
మూడవ టీ20: నవంబర్ 2, హోబర్ట్
నాల్గవ టీ20: నవంబర్ 6, గోల్డ్ కోస్ట్
ఐదవ, ఆఖరి టీ20: నవంబర్ 8, బ్రిస్బేన్
నవంబర్ 8న బ్రిస్బేన్‌లో జరిగే ఐదో టీ20తో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన ముగుస్తుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..