
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఆదాయ వృద్ధికి కూడా సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఎప్పుడు ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. నిరు ద్యోగులకు ఒకటి రెండు శుభ వార్తలు అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవు తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో బరువు, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధార పడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారా లను, పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద దృష్టి పెడతారు. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. పిల్లల పురోగతి విషయంలో శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందు తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. శత్రువులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. మనసులోని కోరిక ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది. శుభ గ్రహాలు బాగా అను కూలంగా ఉన్నందువల్ల ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కుటుంబ వ్యవహా రాలకు సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉంచడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి. మీ మాటకు, చేతకు విలువ పెరుగు తుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో పనిభారం పెరిగినా ప్రతిఫలం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపో తాయి. ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్త వుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో వ్యయ ప్రయాసలు తప్పకపో వచ్చు. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉన్నాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రయాణాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం అనుకూలంగా సాగిపో తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాలలో పని భారం పెరుగుతుంది. వ్యాపారాల్లో రాబడి కొద్దిగా వృద్ధి చెందుతుంది. ఇంటా బయటా ఆశించిన స్థాయిలో గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయ వద్దు. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలకు సమయం చాలా వరకు అను కూలంగా ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది. ఆర్థిక సమస్యలు తప్ప కుండా పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమస్య నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. అన వసర పరిచయాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. ఒకరిద్దరు బంధుమిత్రులకు సహాయం చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలను పాటించడం మంచిది. ఇంటా బయటా పని భారం కాస్తంత ఎక్కు వగానే ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబం మీద బాగా ఖర్చు చేస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు, ఇతర వృత్తి నిపుణులకు రాబడి బాగా పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు చాలా వరకు చక్కబడతాయి. ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. నిరుద్యోగులు సొంత ఊర్లో ఆశించిన ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపో తుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యు లతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. సమాజంలో పలు కుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాల్లో బాగా జాగ్రత్తగా ఉండాలి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు కూడా బాగా బిజీగా సాగిపో తాయి. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించడం మంచిది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. కుటుంబ వ్యవహారాలలో జీవిత భాగ స్వామిని కూడా సంప్రదించడం మంచిది. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగుల మీద అదనపు బాధ్యతల భారం ఉంటుంది. వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగి పోతుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు తగ్గే సూచనలున్నాయి. వ్యయ ప్రయాసలతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఆదాయ ప్రయత్నాల్ని వాయిదా వేయవద్దు. ఆధ్యా త్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తోబుట్టువులతో ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. గృహ, వాహనాల కొనుగోలుపై దృష్టి పెడతారు. అదనపు ఆదాయ ప్రయ త్నాలు చాలావరకు ఫలిస్తాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.