Gujarati buffaloes: గుజరాతీ గేదెలు.. ఒక్కటి ఉన్నా డబ్బే డబ్బు!

Gujarati buffaloes: గుజరాతీ గేదెలు.. ఒక్కటి ఉన్నా డబ్బే డబ్బు!

Gujarati buffaloes: గేదెలు, ఆవులు పాల ఉత్సత్తిలో కీలకం.. పశువులు సాధారణంగా ఇచ్చే పాలు మన జనాభాకు ఏమాత్రం చాలవు అందుకే పాల ఉత్పత్తి పెంచేందుకు శాస్త్రవేత్తలు పరివోధనలు చేస్తున్నారు. విదేశీ ఆవులు, గేదెలను తీసుకొచ్చి పెంచేలా ప్రోత్సహిస్తున్నారు. అయితే మన దేశంలోని గుజరాత్‌కు చెందిన జఫరాబాది జాతి గేదెలు పాల ఉత్పత్తిలో కీలకంగా మారుతున్నాయి. జఫరాబాది జాతి గేదెలకు గుజరాత్‌లోని జమ్నగర్, జఫరాబాద్‌ ప్రాంతాలకు స్వస్థలం. శారీరక నిర్మాణం దృఢంగా ఉండటం, మెడ పొడవుగా కనిపించడం ఇవి ప్రత్యేక లక్షణాలు. నలుపురంగు మృదువైన పొదుగుతో ఆకర్షణీయంగా ఉంటాయి.

భారీగా బరువు..
ఈ జాతి గేదెలు సాధారణంగా 460 కిలోల బరువును చేరుకుంటాయి. ఇతర జాతులతో పోలిస్తే వీటికి పెరుగుదల వేగం ఎక్కువగా ఉంటుంది. ఖాద్య పదార్థాల జీర్ణశక్తి, శారీరక దృఢత్వం కారణంగా దీర్ఘకాల ఉత్పాదకత కలిగి ఉంటాయి. జఫరాబాది గేదెలు అధిక పాల ఉత్పత్తి కోసం ప్రసిద్ధి. సాధారణంగా రోజుకు 15–18 లీటర్ల పాలు ఇస్తాయి. మెరుగైన సంరక్షణతో ఇది 25 లీటర్ల వరకూ చేరుతుంది. వీటి పాలలో వెన్నశాతం 9–10% ఉండటం వలన ఘీ, క్రీమ్, వెన్న ఉత్పత్తులకు ఇవి అత్యుత్తమ ఎంపిక.

సంతానోత్పత్తి లక్షణాలు
ఈ జాతి గేదెలు 48 నుంచి 51 నెలల వయస్సులో తొలి దూడకు జన్మనిస్తాయి. నిరంతర సంతానోత్పత్తి సామర్థ్యం, బలవంతమైన శారీరక నిర్మాణం వల్ల రైతులకు స్థిరమైన ఆదాయ వనరుగా మారుతాయి. ఒక్క జఫరాబాది గేదె ధర సుమారు రూ.80 వేల నుంచి రూ.లక్ష ఉంటుంది. మొదట పెట్టుబడి కొంత ఎక్కువగా ఉన్నా, పాలు ఉత్పత్తి, వెన్న ఉత్పత్తి, సంతాన విలువ ద్వారా దీర్ఘకాలిక లాభాలు ఎక్కువగానే దక్కుతాయి.

రైతులకు ప్రయోజనం
ఈ జాతి గేదెల పెంపకం తక్కువ వ్యాధులు, అధిక పాలు, మంచి మార్కెట్‌ డిమాండ్‌ వంటి అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది. పాలు సహకార సంఘాలు, ప్రైవేట్‌ డెయిరీలు ఈ జాతి పాలను ఎక్కువగా కొనుగోలు చేస్తాయి. సంరక్షణ, పోషణ సరైన పద్ధతిలో ఉంటే జఫరాబాది పెంపకం చిన్న మరియు మధ్య తరహా పశుపాలకులకు మంచి ఆదాయ వనరుగా నిలుస్తుంది.

జఫరాబాది గేదెలు గుజరాత్‌ నుంచి దేశవ్యాప్తంగా వ్యాపించి భారత పశువుల వనరులో విలువైన భాగంగా నిలుస్తున్నాయి. అధిక ఉత్పత్తి, గుణాత్మక పాలు, దృఢ శరీర నిర్మాణం.. ఇవన్నీ కలిసి ఈ జాతిని భారత డెయిరీ రంగంలో ప్రత్యేకంగా నిలిపాయి.

Leave a Comment