Dil Raju as Pan India Producer: పాన్ ఇండియా ప్రొడ్యూసర్ గా దిల్ రాజు… లైనప్ మామూలుగా లేదుగా…

Dil Raju as Pan India Producer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో దిల్ రాజు మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన నుంచి ఒక సినిమా వచ్చిందంటే చాలు ఆ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తోందనే కాన్ఫిడెంట్ ను ప్రేక్షకుల్లో క్రియేట్ చేశాడు. అందుకే ఆయన సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ వస్తోంది. ఇంతకుముందు ఆయన చేసిన ‘బలగం’ లాంటి సినిమాతో నేషనల్ అవార్డుని అందుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సంవత్సరంలో ‘గేమ్ చేంజర్’ సినిమాతో భారీ బడ్జెట్ సినిమాలు చేసి డిజాస్టర్ ను మూటగట్టుకున్నాడు. తద్వారా డబ్బులను కూడా చాలా వరకు నష్టపోయాడు. ఇక అని రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సక్సెస్ ని సాధించి గేమ్ చేంజర్ లాస్ ను కవర్ చేసింది. ఇక ప్రస్తుతం ఇతర ప్రొడ్యూసర్లు భారీ సినిమాలను ఎలాగైతే నిర్మిస్తున్నారో అదే మాదిరిగా దిల్ రాజు ఒక ప్రయోగం చేసి పాన్ ఇండియాలో తన పేరు మారుమ్రోగి పోయేలా చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

రీసెంట్ గా ఓజీ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న దిల్ రాజు చాలా వరకు లాభాలను గడించాడు. దాంతో పవన్ కళ్యాణ్ తో డైరెక్ట్ గా సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇంతకుముందే వీళ్ళ కాంబినేషన్ లో వకీల్ సాబ్ సినిమా వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది దాంతో ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తే బాగుంటుందనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నాడు.

దానికి అనుగుణంగానే అనిల్ రావిపూడి తో ఈ సినిమాను పట్టలెక్కించి తక్కువ రోజుల్లో సినిమాని పూర్తి చేయాలనే ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక ప్రభాస్ తో కూడా దిల్ రాజు ఒక మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ప్రభాస్ దిల్ రాజు కాంబినేషన్ లో మిస్టర్ పర్ఫెక్ట్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయినప్పటికి అప్పటినుంచి ఇప్పటివరకు వీళ్ళ కాంబినేషన్లో మరో సినిమా రాలేదు.

ఇప్పుడు బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లోకి వెళ్ళిపోయిన ప్రభాస్ తో ప్రతి ఒక్క దర్శక నిర్మాత సినిమా చేసి లాభాలు గడించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దిల్ రాజు కూడా ప్రభాస్ తో సినిమా చేసి తనను తాను టాప్ ప్రొడ్యూసర్ గా నిలుపుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.ప్రభాస్ తో సినిమా వచ్చే సంవత్సరం పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయని దిల్ రాజు తెలియజేయడం విశేషం…ఇక ప్రస్తుతం బాలీవుడ్ కండల వీరుడు అయిన సల్మాన్ ఖాన్ తో కూడా ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాడు… మొత్తానికైతే దిల్ రాజు పాన్ ఇండియా ప్రొడ్యూసర్ గా అవతరించడమే తన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుండటం విశేషం…

Leave a Comment