Chicken Shops New Rules: చికెన్ షాపు పెట్టడం ఈజీ కాదు.. ఇకనుంచి అది తప్పనిసరి!

Chicken Shops New Rules: ఏపీ ప్రభుత్వం ( JP government ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. చికెన్ షాపులు, విక్రయాలకు సంబంధించిన అంశంపై ఒక నిర్ణయానికి వచ్చింది. చికెన్ విక్రయాల్లో అక్రమాలను అరికట్టేందుకు కొత్త లైసెన్సింగ్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ చికెన్ వ్యాపారంలో పారదర్శకతను పెంచేందుకు లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. దీని ద్వారా ప్రతి చికెన్ దుకాణానికి లైసెన్స్ తప్పనిసరి. ఈ లైసెన్సు ద్వారా కోళ్ల సప్లై చైన్ ను పూర్తిగా పర్యవేక్షించవచ్చు. పౌల్ట్రీ ఫారాల నుంచి కోళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? షాపుల యజమానులు ఎవరికి అమ్ముతున్నారు? అనే విషయాలను ట్రాక్ చేసేలా పక్కా వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ బోర్డు తీర్మానం చేసింది. ఈ సమాచారాన్ని పక్కాగా నమోదు చేస్తారు.

* మాఫియా కు చెక్..
ఆహార రంగంలో చికెన్( chicken) అమ్మకాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. అయితే చికెన్ విక్రయాల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల విజయవాడలో పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో.. సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. పశుసంవర్ధక శాఖ కీలక అధికారులు సైతం పాల్గొన్నారు. గతంలో జరిగిన మాంసం మాఫియా అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా ప్రతి చికెన్ షాప్ కచ్చితంగా లైసెన్స్ తీసుకోవాల్సిందేనని తీర్మానించారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మాంసం దుకాణాల క్రమబద్ధీకరణ పై దృష్టి సారించింది. మున్సిపాలిటీలో మాంసం దుకాణాలపై అకాస్మిక దాడులు చేసి అక్రమాలను అరికట్టాలని నిర్ణయించింది. హోటల్సు రెస్టారెంట్ల నిర్వాహకులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన చికెన్ షాపుల నుంచే మాంసం కొనుగోలు చేసేలా ప్రోత్సహించనుంది ఏపీ ప్రభుత్వం.

* స్టెరాయిడ్లు వాడకుండా..
సాధారణంగా పౌల్ట్రీ( poultry) లో కోళ్లు పెరిగేందుకు స్టెరాయిడ్లు ఎక్కువగా వాడుతారు. అలా వాడితేనే కోళ్ల ఎదుగుదల ఉంటుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. అయితే ఇకనుంచి స్టెరాయిడ్లు వాడకుండా ప్రభుత్వం తనిఖీలు ముమ్మరం చేయనుంది. స్టెరాయిడ్లు వాడిన కోళ్ల మాంసం తింటున్న వారికి అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. అందుకే వాటిని నియంత్రించాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు చికెన్ షాపుల్లో వ్యర్ధాలను చేపలకు ఆహారంగా వాడుతున్న మాఫియాను అరికట్టి.. ప్రజారోగ్యాన్ని ఇబ్బందిగా కలగకుండా వ్యర్ధాలను సేకరించి సురక్షితంగా పారవేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు మాంస అభివృద్ధి సంస్థ ద్వారా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఒక్కో మోడల్ దుకాణం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం విశేషం. మొత్తానికైతే చికెన్ దుకాణదారుడు కచ్చితంగా లైసెన్స్ తీసుకునేలా నిర్ణయం తీసుకోవడం మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం.

Leave a Comment