BYPOLL:దొంగ ఓట్ల చుట్టూ తిరుగుతున్న “జూబ్లీ” రాజకీయం

తె­లం­గా­ణ­లో­ని పా­ర్టీల మధ్య జూ­బ్లీ­హి­ల్స్ ఉప ఎన్నిక రా­జ­కీయ కా­క­కు కా­ర­ణ­మ­వు­తోం­ది. దొంగ ఓట్లు అంటూ బీ­ఆ­ర్ఎ­స్ చే­సిన వి­మ­ర్శ­లు ఇప్పు­డు చర్చ­నీ­యాం­శం­గా మా­రా­యి. బీ­ఆ­ర్ఎ­స్ ను ఓడిం­చ­డ­మే లక్ష్యం­గా కాం­గ్రె­స్ పా­ర్టీ దొంగ ఓట్ల­తో రా­జ­కీ­యం చే­స్తోం­ద­ని గు­లా­బీ నే­త­లు ఆరో­పిం­చా­రు. అయి­తే బీ­ఆ­ర్ఎ­స్ ఓటమి భయం­తో­నే ఇలాం­టి ఆరో­ప­ణ­లు చే­స్తోం­ద­ని కాం­గ్రె­స్ భగ్గు­మం­ది. అయి­తే బీ­ఆ­ర్ఎ­స్, కాం­గ్రె­స్ పా­ల­న­లో­నే దొంగ ఓట్లు పు­ట్టు­కొ­చ్చా­య­ని బీ­జే­పీ వి­మ­ర్శి­స్తోం­ది.

జూబ్లీహిల్స్‌లో 20 వేల దొంగ ఓట్లు

‘జూ­బ్లీ­హి­ల్స్‌ ఉప ఎన్ని­క­ల్లో ప్ర­జ­లు ఓట్లు వే­య­ర­ని కాం­గ్రె్‌­స­కు అర్థ­మైం­ది. మన­ల్ని ఓడిం­చా­ల­నే కాం­గ్రె­స్‌ ఒక్క ఇం­ట్లో­నే 43 దొంగ ఓట్లు నమో­దు చే­యిం­చిం­ది. ఇలా వేల ఓట్లు చే­ర్చిం­ది. జూ­బ్లీ­హి­ల్స్‌­లో కొ­ట్టే దె­బ్బ­కు ఢి­ల్లీ­లో కాం­గ్రె­స్‌ అధి­ష్ఠా­నం అది­రి­ప­డాల’ని బీ­ఆ­ర్‌­ఎ­స్‌ వర్కిం­గ్‌ ప్రె­సి­డెం­ట్‌ కే­టీ­ఆ­ర్‌ కా­ర్య­క­ర్త­ల­కు పి­లు­పు­ని­చ్చా­రు. రహ­మ­త్‌­న­గ­ర్‌ డి­వి­జ­న్‌ పా­ర్టీ కా­ర్య­క­ర్తల సమా­వే­శం­లో, రా­ష్ట్ర ఎన్ని­కల ప్ర­ధాన అధి­కా­రి­కి ఫి­ర్యా­దు చే­శా­రు. జూ­బ్లీ­హి­ల్స్‌­లో 400 పో­లిం­గ్‌ కేం­ద్రాల పరి­ధి­లో 50-100 చొ­ప్పున మొ­త్తం 20 వేల దొంగ ఓట్ల­ను నమో­దు చే­యిం­చి­న­ట్లు తమ దృ­ష్టి­కి వచ్చిం­ద­ని తె­లి­పా­రు. కాం­గ్రె­స్‌ గు­రిం­చి, రే­వం­త్‌ రె­డ్డి గు­రిం­చి హై­ద­రా­బా­ద్‌ ప్ర­జ­ల­కు బాగా తె­లు­స­ని, అం­దు­కే గత అసెం­బ్లీ ఎన్ని­క­ల్లో ఆ పా­ర్టీ­కి ఒక్క సీటు కూడా దక్క­లే­ద­ని వ్యా­ఖ్యా­నిం­చా­రు. జూ­బ్లీ హి­ల్స్‌ ఉప ఎన్నిక కా­రు­కు, బు­ల్డో­జ­రు­కు మధ్య జరు­గు­తోం­ద­ని, ఎన్నిక తర్వాత మీ ఇం­టి­కి కారు రా­వా­లా, బు­ల్డో­జ­రు రా­వా­లా అనే­ది ప్ర­జ­లు ఆలో­చిం­చా­ల­న్నా­రు.

బీఆర్ఎస్ కొత్త నాటకం:మంత్రి వివేక్

దొంగ ఓట్లు అంటూ బీ­ఆ­ర్ఎ­స్ తప్పు­డు ప్ర­చా­రం చే­స్తు­న్న­ద­ని మం­త్రి వి­వే­క్ వెం­క­ట­స్వా­మి ఫైర్ అయ్యా­రు. గత అసెం­బ్లీ, పా­ర్ల­మెం­ట్ ఎన్ని­కల సమ­యం­లో ఉన్న ఓట్లే ఇప్పు­డు ఉన్నా­య­ని స్ప­ష్టం చే­శా­రు. ఎన్ని­కల ప్ర­చా­రం­లో చె­ప్పేం­దు­కు ఏమీ లే­క­పో­వ­డం­తో­నే దొంగ ఓట్లు అంటూ బీ­ఆ­ర్ఎ­స్ కొ­త్త నా­ట­కా­ని­కి తె­ర­లే­పిం­ద­ని మం­డి­ప­డ్డా­రు. ‘‘జూ­బ్లీ­హి­ల్స్‌­‌­‌­‌­లో ఏవో అక్ర­మా­లు జరు­గు­తు­న్నా­య­ని బీ­ఆ­ర్ఎ­స్ ప్ర­జ­ల్లో గం­ద­ర­గో­ళం సృ­ష్టి­స్తు­న్న­ది. ఓటర్ లి­స్టు­ల­ను కాం­గ్రె­స్ తయా­రు చే­య­దు. ఈసీ తయా­రు చే­స్తుం­ది. గతం­లో ఉన్న ఆ 43 ఓట్లు ఇప్పు­డూ ఉన్నా­యి. అసెం­బ్లీ ఎన్ని­క­ల్లో, ఆ తర్వాత జరి­గిన పా­ర్ల­మెం­ట్ ఎన్ని­క­ల్లో కూడా అవే ఓట్లు ఉన్నా­యి. ఇప్పు­డు జూ­బ్లీ­హి­ల్స్ ఉప ఎన్నిక కోసం కొ­త్త­గా ఆ ఓట్లు రా­లే­దు. దీ­ని­పై ఈసీ స్ప­ష్టత ఇచ్చిన తర్వాత కూడా బీ­ఆ­ర్ఎ­స్ రా­ద్ధాం­తం చే­స్తు­న్న­ది. ఇది కే­వ­లం రా­జ­కీయ లబ్ధి కో­స­మే. కాం­గ్రె­స్ ను బద్నాం చే­సేం­దు­కే. అయి­నా తె­లం­గాణ సమా­జం బీ­ఆ­ర్ఎ­స్ మా­ట­ల­ను నమ్మే పరి­స్థి­తి లేదు. గత పదే­ళ్లు­గా ఆ పా­ర్టీ­ని నమ్మి మో­స­పో­యా­మ­నే …గత అసెం­బ్లీ ఎన్ని­క­ల్లో జనం కాం­గ్రె­స్ కు అధి­కా­రం ఇచ్చా­రు” అని పే­ర్కొ­న్నా­రు.

దొంగ ఓట్లు తెచ్చిందే బీఆర్‌ఎస్.. ఎంపీ

జూ­బ్లీ­హి­ల్స్‌­లో ఓట్ల చోరీ జరి­గిం­ద­ని కే­టీ­ఆ­ర్ అనటం హా­స్యా­స్ప­ద­మ­ని ఎంపీ అర్విం­ద్ అన్నా­రు. తె­లం­గా­ణ­లో దొంగ ఓట్లు తె­చ్చిం­దే బీ­ఆ­ర్‌­ఎ­స్ పా­ర్టీ అని ఆరో­పిం­చా­రు. జూ­బ్లీ­హి­ల్స్‌­లో అపా­ర్టు­మెం­ట్‌­లో 43 ఓట్లు దొంగ ఓట్లై­తే, బో­ధ­న్‌­లో బీ­ఆ­ర్‌­ఎ­స్ హయాం­లో 42 దొంగ పా­స్‌­పో­ర్టు­లు ఇచ్చిన సం­గ­తి మరి­చా­రా అంటూ వ్యా­ఖ్య­లు చే­శా­రు. బం­గ్లా­దే­శ్, మయ­న్మా­ర్ దే­శ­స్థు­ల­కు గతం­లో ఆశ్ర­యం ఇచ్చిం­ది బీ­ఆ­ర్‌­ఎ­స్ పా­ర్టీ­నే అని గు­ర్తు­చే­శా­రు. జూ­బ్లీ­హి­ల్స్‌­లో డ్ర­గ్స్, మత్తు పదా­ర్థాల దం­దా­కు తె­ర­లే­పిం­ది కే­టీ­ఆ­ర్ కాదా అని ప్ర­శ్నిం­చా­రు. జూ­బ్లీ­హి­ల్స్ క్ల­బ్బు­ల్లో డ్ర­గ్స్ సర­ఫ­రా చే­సిం­ది కే­టీ­ఆ­ర్ అని మం­డి­ప­డ్డా­రు. 42 శాతం బీసీ రి­జ­ర్వే­ష­న్ అం­శం­లో కాం­గ్రె­స్ డ్రా­మా­లా­డు­తోం­ద­ని ఎంపీ వి­మ­ర్శిం­చా­రు. 42 శాతం అమలు ప్రా­సె­స్ కాం­గ్రె­స్ సరి­గా చే­య­లే­ద­న్నా­రు. ఈ అం­శం­లో బీ­జే­పీ­ని కా­ర్న­ర్ చేసే ప్ర­య­త్నం కాం­గ్రె­స్ చే­స్తోం­ద­ని ఆరో­పిం­చా­రు. కాం­గ్రె­స్ పా­ర్టీ పరి­స్థి­తి రో­జు­రో­జు­కీ ది­గ­జా­రి­పో­తోం­ద­న్నా­రు.

Leave a Comment