Budh Gochar 2025: వృశ్చిక రాశిలో బుధుడు.. ఈ రాశులకు ఆదాయ వృద్ధి, శుభ యోగాలు – Telugu News | Mercury in Scorpio Transit: Auspicious Effects for 6 Zodiac Signs Details in Telugu

ఈ నెల(అక్టోబర్) 24 తేదీ నుంచి నవంబర్ 23వ తేదీ వరకు బుధుడు వృశ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. బుధుడికి వృశ్చిక రాశి ఏమాత్రం అనుకూల రాశి కాదు. అయినప్పటికీ ఈ నెల రోజుల కాలంలో బుధుడు ఆరు రాశులకు శుభ ఫలితాలనిస్తాడు. వృషభం, సింహం, తుల, మకరం, కుంభం, మీన రాశుల వారికి మాత్రం ఈ వృశ్చిక బుధుడి వల్ల కొన్ని శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆస్తి వివాదాలు పరిష్కారం కావడం, ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షల్లో విజయాలు సాధించడం, ఆదాయం వృద్ది చెందడం, ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం కావడం, శుభ వార్తలు వినడం, ఆరోగ్యం కుదుటపడడం వంటివి తప్పకుండా జరుగుతాయి.

  1. వృషభం: ఈ రాశికి ధనాధిపతి అయిన బుధుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదరడం గానీ, ప్రేమలో పడడం గానీ జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సమర్థతకు గుర్తింపు లభించి ఉన్నత పదవులు చేపడతారు. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఆర్థిక, ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అను కూలంగా పరిష్కారమవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. సంతాన యోగం కలుగుతుంది.
  2. సింహం: ఈ రాశికి చతుర్థ స్థానంలో బుధ సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభకు, సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. తప్పకుండా హోదా పెరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆస్తిపాస్తుల సమస్యలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా, ఉద్యోగపరంగా స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి.
  3. తుల: ఈ రాశికి ధన స్థానంలో భాగ్యాధిపతి బుధుడి సంచారం వల్ల నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. విదేశీ సంపాదన అనుభవించే యోగం కలుగుతుంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. ప్రభుత్వ సంబంధమైన ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షల్లో తేలికగా విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు శీఘ్ర పురోగతి చెందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.
  4. మకరం: ఈ రాశికి అత్యంత శుభుడైన బుధుడు లాభ స్థానంలో సంచారం చేయడం వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువగా ఉంటుంది. అనేక విధాలుగా సంపద పెరుగుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశముంది. ఆస్తి, గృహ సంబంధమైన ఒప్పందాలు కుదురుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ సమర్థత, శక్తి సామర్థ్యాలు బాగా రాణిస్తాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. కుటుంబ, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి.
  5. కుంభం: ఈ రాశికి దశమ స్థానంలో బుధ సంచారం వల్ల ఉద్యోగంలోనూ, వృత్తి, వ్యాపారాల్లోనూ శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో తప్పకుండా అందలాలు ఎక్కుతారు. వృత్తి, వ్యాపా రాలు కష్టనష్టాల నుంచి బయటపడి అభివృద్ధి బాటపడతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి.
  6. మీనం: ఈ రాశికి భాగ్య స్థానంలో బుధ సంచారం వల్ల అనేక విధాలైన అదృష్టాలు కలుగుతాయి. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఉద్యోగంలో మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు బాగా లబ్ధి పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

Leave a Comment