Bigg Boss 9 Telugu elimination: ‘బిగ్ బాస్ 9’ లో ఈ వారం ఎలిమినేషన్ కూడా వైల్డ్ కార్డ్స్ చేతుల్లోనే..? డేంజర్ జోన్ లో తండ్రికూతుళ్లు!

Bigg Boss 9 Telugu elimination: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో మీద ఆడియన్స్ కి చిన్నగా ఆసక్తి పోతోంది. మొదటి మూడు వారాలు బాగానే షో నడిచింది కానీ, నాల్గవ వారం నుండి మాత్రం పూర్తిగా గాడి తప్పింది. అందుకు కారణం జనాల ఓట్లను లెక్క చేయకుండా ఎలిమినేషన్ ప్రక్రియ చేయడమే. గత వారం లో జరిగిన శ్రీజ ఎలిమినేషన్ ఆడియన్స్ ఓట్లతో కాకుండా, వైల్డ్ కార్డ్స్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ చేత చేయించారు. అప్పటి నుండి ఈ షో ని చూసే ఆడియన్స్ సంఖ్య బాగా తగ్గిపోయింది. పైగా ఈ వారం టాస్కులు కూడా లేకపోవడం మరో మైనస్ అని చెప్పొచ్చు. నిన్నటి ఎపిసోడ్ మొత్తం ఖాళీగా టాస్కులు లేకుండా ఉంచడం ఆడియన్స్ కి చిరాకు కలిగించింది. అయితే నామినేషన్స్ ప్రక్రియ ఒక్కటే కాస్త ఆసక్తి కరంగా సాగింది.

మంచి రసవత్తరంగా ఉండేలాగానే బిగ్ బాస్ ఈ నామినేషన్స్ ప్రక్రియ ప్లాన్ చేసాడు. కానీ వైల్డ్ కార్డ్స్ తనూజ తో భరణి, దివ్య లను, లేదా భరణి తో తనూజ, ఇమ్మానుయేల్ లను నామినేట్ చేయించడంలో విఫలం అయ్యారు. ఒకవేళ చేసి ఉండుంటే ఎపిసోడ్ వేరే లెవెల్ లో ఉండేది. అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లేందుకు తనూజ, భరణి, దివ్య, డిమోన్ పవన్, సుమన్ శెట్టి, రాము రాథోడ్ నామినేట్ అయ్యారు. వీరిలో తనూజ, సుమన్ శెట్టి తప్ప, మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ డేంజర్ జోన్ లోనే ఉన్నారు. ఈ వారం భరణి, దివ్య లలో ఒకరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. డేంజర్ జోన్ లో కచ్చితంగా రాము ఉంటాడు. అతనితో పాటు మిగిలిన ముగ్గురిలో ఎవరు ఉంటారు అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. దివ్య కి గత రెండు మూడు రోజులుగా దివ్వెల మాధురి తో గొడవలు జరుగుతున్నాయి కాబట్టి, ఆమె గ్రాఫ్ ప్రస్తుతానికి బాగానే ఉంది.

ఈమె డేంజర్ జోన్ లోకి వచ్చే అవకాశం లేదు. ఇక డిమోన్ పవన్ కి సోషల్ మీడియా ఓటింగ్ భారీగానే ఉంది, భరణి కి అతనితో పోలిస్తే తక్కువ. కానీ డిమోన్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ఓటింగ్ అంతగా ఉండదు. ఇదంతా పక్కన పెడితే డేంజర్ జోన్ లోకి ఒకవేళ భరణి వస్తే అతన్ని ఆ జోన్ నుండి సేవ్ చేయడానికి ఇమ్మానుయేల్ ఉన్నాడు. ఎందుకంటే ఆయన చేతిలో పవర్ అస్త్ర ఉంది. ఒకవేళ ఇమ్మానుయేల్ ని కాకుండా, ఎలిమినేషన్ నుండి సేవ్ చేసే పవర్ ఉన్నటువంటి సాయి ని నాగార్జున ఉపయోగించమని చెప్తే, అతని భరణి ని సేవ్ చేయడం కంటే, రాము లేదా డిమోన్ పవన్ లను సేవ్ చేయడానికి ప్రాధాన్యత చూపిస్తాడు. కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ కూడా వైల్డ్ కార్డ్స్ చేతుల్లో, లేదా ఇమ్మానుయేల్ చేతిలో ఉంది అన్నమాట. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Leave a Comment