Apple: యాపిల్ ఎలా తింటే మంచిది.. తొక్కతోనా.. తొక్క లేకుండనా..? తప్పక తెలుసుకోండి.. – Telugu News | Why Eating Apple Peel Gives You More Vitamins and Fiber, You Need To Know

ప్రతి రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు అనే మాట మనకు తెలిసిందే. యాపిల్ పండు మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. అయితే చాలా మంది యాపిల్‌ను తొక్క తీసి తింటే.. మరికొందరు తొక్కతో సహా తింటారు. నిజానికి ఏ పద్ధతి సరైనదో ఇప్పుడు తెలుసుకుందాం.

తొక్కతో తింటేనే ఎక్కువ ప్రయోజనాలు

చాలా మంది పరిశుభ్రత లేదా రుచి కారణంగా యాపిల్ తొక్క తీసి తింటారు. కానీ మీరు యాపిల్ తొక్క తీయకుండా తింటే మీకు ఎక్కువ పోషకాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. యాపిల్ పండు లోపలి భాగం (కోర్) ఫైబర్, విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లతో నిండి ఉన్నప్పటికీ, యాపిల్ తొక్కలో అనేక అదనపు, ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

యాపిల్ పండును తొక్కతో తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు:

ఊపిరితిత్తుల రక్షణ

యాపిల్ తొక్కలో క్వెర్సెటిన్ అనే ముఖ్యమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనం ఉంటుంది. ఇది అనేక రకాల వ్యాధుల నుంచి మన ఊపిరితిత్తులను రక్షించడానికి సహాయపడుతుంది.

గుండెకు ఆరోగ్యం

యాపిల్ తొక్కలలో కనిపించే యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి తోడ్పడతాయి. దీని ఫలితంగా మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

బరువు తగ్గడంలో సహాయం

యాపిల్ తొక్కలు పోషకాలతో నిండి ఉంటాయి. ముఖ్యంగా దీనిలోని అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా మీకు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీనివల్ల మీరు అతిగా తినకుండా ఉంటారు. ఇది బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది.

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ

యాపిల్ తొక్కల్లోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, గ్యాస్ లేదా ఉబ్బరంతో బాధపడేవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది కాలేయ ఎముకల ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తుంది.

విటమిన్లు, మినరల్స్ నిధి

యాపిల్ తొక్కలో విటమిన్లు A, K, C తో పాటు పొటాషియం, కాల్షియం, పాస్పరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీలు, గుండె, మెదడు, చర్మం, ఎముకల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

యాపిల్‌ను తినే ముందు పండును బాగా కడిగి, శుభ్రం చేసుకుని తొక్కతో సహా తినడం ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరమైన పద్ధతి. అందుకే యాపిల్ తినేటప్పుడు తొక్క తీయకుండా తినడం అలవాటు చేసుకోండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

[

Leave a Comment