కెనడాలోని సర్రేలో ఉన్న హాస్యనటుడు కపిల్ శర్మ కాప్స్ కేఫ్‌లో మరోసారి కాల్పులు జరిగాయి. మూడు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటపడింది. ఈ మేరకు గోల్డీ ధిల్లాన్, కుల్దీప్ సిద్ధు సోషల్ మీడియా పోస్ట్‌లో చేశారు. ” నేను, కుల్వీర్ సిద్ధు, గోల్డీ ధిల్లాన్ ఈరోజు సర్రేలోని కాప్స్ కేఫ్‌లో జరిగిన మూడు కాల్పులకు బాధ్యత వహిస్తున్నాము” అని పోస్ట్‌లో పేర్కొన్నారు. కుల్వీర్ స్వయంగా ఈ పోస్ట్‌ను పోస్ట్ చేశారు.
“మాకు సాధారణ ప్రజలతో ఎలాంటి శత్రుత్వం లేదు. మాకు విభేదాలు ఉన్నవారు మాకు దూరంగా ఉండాలి. చట్టవిరుద్ధమైన పనిలో పాల్గొనేవారు, వారి పనికి ప్రజలకు డబ్బు చెల్లించని వారు కూడా సిద్ధంగా ఉండాలి. బాలీవుడ్‌లో మతానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు కూడా సిద్ధంగా ఉండాలి. బుల్లెట్లు ఎక్కడి నుండైనా రావచ్చు. వాహెగురు జీ కా ఖల్సా, వాహెగురు జీ కి ఫతే.” అంటూ రాసుకొచ్చారు.
నిజానికి, కపిల్ శర్మ కేఫ్‌పై గతంలో కాల్పులు జరిగాయి. ఆగస్టులో కాప్స్ కేఫ్‌పై ఈ దాడి జరిగింది. ఒక నెలలోపు ఇది రెండవ దాడి. ఆ సమయంలో 25 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న గోల్డీ ధిల్లాన్ సోషల్ మీడియా పోస్ట్‌లో దాడికి బాధ్యత వహించి కపిల్ శర్మను మరోసారి బెదిరించాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..